చెప్పులు దాస్తే రూ. 5 వేలు.. పెళ్లికొడుకుపై దాడి

By Ravi
On
చెప్పులు దాస్తే రూ. 5 వేలు.. పెళ్లికొడుకుపై దాడి

పెళ్లి తంతులో ఏ సంప్రదాయంలో అయినా ఎన్నో రకాల సంప్రదాయాలు ఉంటాయి. అలా పెళ్లికొడుకు చెప్పులు దాచిపెట్టి.. పెళ్లి కూతురి తరపున బంధువులు ఆట పట్టించి డబ్బులు వసూళ్లు చేస్తుంటారు. ఈ ఆట పెళ్లిలో ఎంతో సరదాగా ఆడుతూ.. పెళ్లికొడుకును ఆటపట్టిస్తూ ఉంటారు. కానీ తాజాగా జరిగిన ఓ వివాహంలోని ఈ సంప్రదాయం ఆ పెళ్లికొడుక్కి జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవంగా మారింది. అసలు వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో వివాహ తంతు జరుగుతుంది. ఈ క్రమంలో పెళ్లికొడుకు చెప్పులు దాచి పెట్టినందుకు పెళ్లికూతురు బంధువులకు రూ.50 వేలకు బదులు 5 వేల రూపాయలు ఇచ్చారని.. వరుడిపై దాడి చేశారు. ఈ క్రమంలో వరుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

ఉత్తరాఖండ్ కు చెందిన వరుడు ముహమ్మద్ షబీర్ కు, ఉత్తరప్రదేశ్ లోని ఓ యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. వారి ఆచారాల ప్రకారం చెప్పులు దాచడం అనే కార్యక్రమంలో భాగంగా వధువు కుటుంబ సభ్యులు వరుడి చెప్పులు దాచిపెట్టారు. వాటిని ఇవ్వాలంటే 50 వేల రూపాలయలు ఇవ్వాలని కోరారు. అయితే పెళ్లికొడుకు మాత్రం 5 వేల రూపాయలు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన వధువు బంధువులు పెళ్లి కొడుకుని ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు. దీంతో పెళ్ళి కొడుకు బంధువులు పెళ్లికి పెట్టిన బంగారం గురించి ప్రశ్నించారు. మాటా మాటా పెరిగి ఇద్దరి కుటుంబాల మధ్య గొడవ పెరిగింది. ఈ క్రమంలో వరుడిని గదిలో బంధించి కొట్టారు. ఈ విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి.. కౌన్సిలింగ్ ఇచ్చారు.

Tags:

Advertisement

Latest News

KKR vs LSG మ్యాచ్‌ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అజింక్య రహానే KKR vs LSG మ్యాచ్‌ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అజింక్య రహానే
ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా, లక్నో జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది. స్పెన్సర్ జాన్సన్ ఫైనల్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
నేడు రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. 
ఇరాన్ తో అణు ఒప్పందం : ట్రంప్
అమెరికాలో ఆర్థిక మాంద్యం..!
త్వరలోనే బంగ్లాకు తిరిగొస్తా: షేక్ హసీనా
దుస్తులు విప్పించి.. మగాళ్లతో చెకింగ్.. ఎయిర్ పోర్ట్ లో దారుణం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..