నేడు హైఓల్టేజ్ తో ముంబై వర్సెస్ ఆర్సీబీ

By Ravi
On
నేడు హైఓల్టేజ్ తో ముంబై వర్సెస్ ఆర్సీబీ

ఐపీఎల్ 2025 లో భాగంగా ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై, బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రస్థానం అంతగా ప్రభావం చూపించలేదు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే అందుకొని పాయింట్స్ లిస్ట్ లో 8వ స్థానానికి పరిమితమైంది. చివరి మ్యాచ్‌ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యింది. ఇక మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టోర్నీని ఘనంగా స్టార్ట్ చేశారు. కోల్‌కతా టీమ్, చెన్నై టీమ్ పై వరుస విజయాలు సాధించి జోరుమీదుంది. కానీ, సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఫెయిల్ అయ్యింది. 

ఇక వాంఖడే స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, కొత్త బంతితో పేసర్లు తమ హవా చూపించే అవకాశం కనిపిస్తుంది. ఓపెనర్లు ఆచితూచి ఆడితే భారీ స్కోర్లు పక్కా. ఇక్కడ బౌండరీలు చిన్నగా ఉండటం, అవుట్‌ఫీల్డ్ వేగంగా ఉండటం బ్యాటర్లకు కలిసొచ్చే అంశాలు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు వాంఖడేలో జరిగిన 119 మ్యాచ్‌ల్లో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 171 పరుగులుగా నమోదైంది. కాగా ఛేజింగ్‌ కు దిగిన జట్లు 65 సార్లు విజయం సాధించగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 53 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.

Tags:

Advertisement

Latest News

అక్రమంగా బాడీ బిల్డింగ్‌ స్టెరాయిడ్స్‌ విక్రయాలు అక్రమంగా బాడీ బిల్డింగ్‌ స్టెరాయిడ్స్‌ విక్రయాలు
దారుఢ్యం కోసం ఉపయోగించే స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు, టాబ్లెట్‌లు మరియు క్యాప్సూల్స్‌ను అక్రమంగా కొనుగోలు చేసి విక్రయించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ....
దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు..!
అడవి తల్లి బాటతో గిరిజన గ్రామాలకు మహర్ధశ
ఇషాంత్ శ‌ర్మ‌కు బీసీసీఐ ఫైన్.. కారణం ఏంటంటే?
బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ మోసం
16 ఏళ్ల అమ్మాయిపై బ్యాడ్మింట‌న్ కోచ్ అరాచకం
ఆర్సీబీపై బుమ్రాకు అదిరిపోయే రికార్డ్