శ్రీలంకతో భారత్ మొదటి రక్షణ ఒప్పందం

By Ravi
On
శ్రీలంకతో భారత్ మొదటి రక్షణ ఒప్పందం

తాజాగా శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ భారత్ తరఫున ఆ దేశానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాగా ఈ టూర్ లో శ్రీలంక ప్రధానితో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇక మోడీ చైనా దూకుడుకు కూడా చెక్ పెట్టారు. ఈ మధ్య కాలంలో చైనా వైపు మొగ్గుతున్న శ్రీలంకకు అడ్డుకట్ట వేశారు. శ్రీలంక టూర్ లో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యక్షుడితో భేటి అయ్యేందుకు నరేంద్ర మోదీకి స్వాగతం దక్కింది. గార్డ్ ఆఫ్ హానర్ తో శ్రీలంక అధికారులు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. శ్రీలంకతో దీవుల విషయంలో ఎదురవుతున్న సమస్యల కారణంగా ఇరుదేశాల జైళ్లలో ఉన్న మత్సకారుల్ని విడుదల చేయాలని ఇరువురు ప్రధానులు ఈ సందర్భంగా నిర్ణయించారు. 

గతేడాది సంక్షోభాల తర్వాత శ్రీలంక కోలుకోవడంపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కోవిడ్, తీవ్రవాద దాడుల సమయంలో శ్రీలంకకు అండగా నిలిచామని, భవిష్యత్తులోనూ ఆ దేశానికి అన్ని విధాలా సహకరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీలంకతో తొలి రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో పాటు డిజిటల్, ధర్మల్ సహా ఇతర రంగాల్లో ఆరు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. మరోవైపు యూఏఈతో కలిసి శ్రీలంకలో ఇంధన కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాని మోడీ మరో ఒప్పందం కుదుర్చుకున్నారు.

Tags:

Advertisement

Latest News

అక్రమంగా బాడీ బిల్డింగ్‌ స్టెరాయిడ్స్‌ విక్రయాలు అక్రమంగా బాడీ బిల్డింగ్‌ స్టెరాయిడ్స్‌ విక్రయాలు
దారుఢ్యం కోసం ఉపయోగించే స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు, టాబ్లెట్‌లు మరియు క్యాప్సూల్స్‌ను అక్రమంగా కొనుగోలు చేసి విక్రయించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ....
దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు..!
అడవి తల్లి బాటతో గిరిజన గ్రామాలకు మహర్ధశ
ఇషాంత్ శ‌ర్మ‌కు బీసీసీఐ ఫైన్.. కారణం ఏంటంటే?
బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ మోసం
16 ఏళ్ల అమ్మాయిపై బ్యాడ్మింట‌న్ కోచ్ అరాచకం
ఆర్సీబీపై బుమ్రాకు అదిరిపోయే రికార్డ్