తెలంగాణ శాసన మండలిలో బడ్జెట్‌పై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగం

By Ravi
On

 
 
స్క్రోలింగ్ పాయింట్స్:
 
* ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు సమపాలలో ప్రాధాన్యతిస్తూ రూ.3,04,965 కోట్ల వ్యయంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం అభినందనీయం.
 
*  ప్ర‌జాపాల‌న‌లో  ప్రజా సంక్షేమ, అభివృద్ధి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి తమది  ప్రజా ప్రభుత్వమని  కాంగ్రెస్‌  మరోసారి నిరూపించుకుంది.
 
* కాంగ్రెస్ అభివృద్ధికి బిఆర్ఎస్ ఆర్ధిక విధ్వంసం అడ్డుగా మారింది
 
* గతంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో కేసిఆర్ బడే భాయ్ చోటా భాయ్ లా వ్యవహరించారు
 
* అన్ని అంశాల్లో కేంద్రంలోని బీజేపీకి మద్దతిచ్చిన బిఆర్ఎస్ నేతలు తెలంగాణ కు రావాల్సిన నిధులను అడిగి తీసుకురాలేకపోయారు
 
*  పదేళ్లలో విభజన అంశాలను కేసిఆర్ ప్రభుత్వం గాలికొదిలేసింది
 
* గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయింది?
 
* తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోంది
 
* కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల కేంద్ర బీజేపీ వివక్ష చూపిస్తోంది
 
* బ‌డ్జెట్ లో మ‌హిళా సాధికారతతో పాటు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, పరిశ్రమలకు అధిక  ప్రాధాన్యతిచ్చారు.
 
* ఎన్నికల్లో అభయహస్తం ప్రకటించిన కాంగ్రెస్‌ వరుసగా రెండో సారి కూడా బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు పెద్ద పీట వేసి  మాది చేతల ప్రభుత్వమని రుజువు చేసుకుంది.
 
* ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అగ్ర తాంబూలం వేస్తూ రూ.56,084 కోట్లు కేటాయించి మాది పేదల ప్రభుత్వమ‌ని నిరుపించుకున్నాం 
 
* పేదల పక్షపాతి అయిన కాంగ్రెస్‌ ప్రజా సంక్షేమం బ‌డ్జెట్ పై  ప్రతిపక్షాలు అర్థరహిత విమర్శలు చేయడం శోచనీయం.
 
* రైతులు బాగుంటేనే సమాజం సస్యశ్యామలంగా ఉంటుందని విశ్వసించే కాంగ్రెస్ బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ   రూ.23,349 కోట్లు కేటాయించి తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని నిరూపించుకున్నాం
 
* దేశానికి రైతు వెన్నెముక మాట‌కు కట్టుబ‌డి  అన్న‌దాత‌ల శ్రేయ‌స్సుకోసం   రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు ప్రతిపాదించి  వ్యవసాయ పెట్టుబడిపై ప్రభుత్వం భరోసా కల్పించింది. 
 
* గత ప్ర‌భుత్వంలో అన్న‌దాత‌ల‌కు సాయం అందించే ఉద్దేశ్యంతో  రూ.10 వేలున్న రైతు బంధు సాయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.12 వేలకు పెంచి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
 
*   దేశంలోనే మొదటి సారిగా   రైతు కూలీల కష్టాలను గుర్తించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వారికి ఏడాదికి రూ.12 ఇచ్చేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం రూ.600 కోట్లు కేటాయించింది.
 
*  గ‌త ప్ర‌భుత్వంలో లేని విధంగా  వరికి బోనస్‌ కోసం రూ.1800 కోట్లు వెచ్చించి  సన్న వరి సాగు రైత‌న్న‌ల‌ను  ప్రోత్సాహిస్తోంది. 
 
* రైతు రుణమాఫీ కింద ఒకేసారి 25.35 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్లకుపైగా రుణమాఫీ చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందనే విషయం అందరికీ తెలిసిందే.
 
* నీటి పారుదల శాఖకు రూ.23,373 కోట్లు కేటాయించిన ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ హయాంలో పెడింగ్ లో  ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి ఏ,బీ లుగా విభజించి పూర్తి చేయాలనే ప్రణాళికలు రూపొందించడం  సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనం. 
 
* మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి పథకం ప్రవేశపెట్టి మహిళలలను అన్ని రంగాల్లో ప్రోత్సాహిస్తోంది. 
 
* కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంతో 7227 బస్సుల్లో 149.63 కోట్ల మంది మహిళలు  వినియోగించుకొని రూ.5005.95 కోట్ల రూపాయాలు ఆదా చేసుకొని ఆడబడుచులు ఆర్థికంగా బలపడడం సంతోషకరం. 
 
* ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఈ బడ్జెట్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్ర‌భుత్వం రూ.4305 కోట్లు కేటాయించింది. 
 
* గృహజ్యోతి పథకం కింద ఇప్పటికే 50 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుండగా, ఈ పథకానికి ఇప్పుడు రూ.2080 కోట్లు కేటాయిండం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం
 
* గ్యాస్‌ సబ్సిడీ పథకంతో 43 లక్షల కుటుంబాలకుపైగా ప్రయోజనం కలుగుతుండగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.723 కోట్లు మంజూరు చేశారు. 
 
* మహిళలకు పెద్ద పీట వేసే లక్ష్యంతో ఆడపడుచుల పేరు మీద 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం ఇందుకు బడ్జెట్లో రూ.12,571 కోట్లు కేటాయించింది. 
 
*  చేయూత పెన్ష‌న్ల  కోసం రూ.14,861 కోట్లు కేటాయించిన ప్రభుత్వం నిరుపేదలను ఆదోకోవడం తమ లక్ష్యమని మరోసారి చాటి చెప్పింది.  
 
* నిరుపేదలు అనారోగ్యం బారిన పడితే పడే ఇబ్బందులు ఎరిగి  ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడంతో 90 లక్షలకుపైగా నిరుపేదల కుటుంబాలకు ప్రయోజనం కలగడం ఆనంద దాయకం. 
 
*  ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం సంక‌ల్పంతో వైద్య‌రంగానికి వైద్య రంగానికి రూ.12,393 కోట్లు.. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ కోసం రూ.1143 కోట్లు కేటాయించింది.
 
* రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ప్ర‌భుత్వం ఇప్పటికే 57 వేలకు పైగా ప్రభుత్వ నియామకాలు పూర్తి చేసింది. 
 
* దావోస్‌లో 1.78 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించి రికార్డు సృష్టించిన తెలంగాణ ప్ర‌భుత్వం  పారిశ్రామిక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా పారిశ్రామిక‌ శాఖకు రూ.3527 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు కేటాయించింది.
 
*  తెలంగాణలో పెట్టుబడులను ప్రోత్సాహించి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగా అవకాశాలు  కల్పించాలని ప్ర‌భుత్వం సంకల్పించింది. కార్మిక ఉపాధి శాఖకు రూ.900 కోట్లు కేటాయించారు. 
 
*  జాతీయ సంస్థ పీఎల్‌ఎఫ్‌ఎస్‌ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2023లో నిరుద్యోగ రేటు 22.9 శాతం ఉండగా, 2024 నాటికి 18.1 శాతానికి తగ్గడం కాంగ్రెస్‌ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం. 
 
* అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నిరుపేదలు అందరికీ విద్య చేరువ కావాలనే లక్ష్యంతో 58 యంగ్‌ ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతించాల్సిన అంశం.
 
*  గురుకులాల్లో, హాస్టల్స్‌లో విద్యా ప్రమాణాలతో అనేక వసతులు కూడా పెంపొందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లో విద్యా రంగానికి ప్రభుత్వం రూ.11,600 కోట్లు కేటాయించడం శుభ‌ప‌రిణామం. 
 
* దేశ చరిత్ర‌లో నిలిచిపోయే చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యాలైన‌  కుల‌గ‌ణ‌న‌, బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు , ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చేసి సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్య‌మ‌ని ప్ర‌భుత్వం నిరూపించింది. 
 
* ఎస్సీ వర్గీకరణ తో ఎస్సీల 30 ఏళ్ల కల సాకారమైంది
Tags:

Advertisement

Latest News

బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..! బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..!
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....
కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!
కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!
బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!