ఘంటసాల కుమారుడు కన్నుమూత..!

By Ravi
On
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!

అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు ఘంటసాల రవి కన్ను మూశారు. ఆయన కొంతకాలంగా  అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ప్రముఖ భరత నాట్య గురు కలైమామణి పార్వతి ఆయన శ్రీమతి. కుమారుడు మొహిందర్ ఘంటసాల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఘంటసాల రవి సౌండ్ ఇంజనీర్‌గా పని చేశారు. భార్య పార్వతి నాట్యరంగంలో విశేషంగా రాణించడానికి, దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి రవి చాలా ప్రోత్సాహం అందించారు. ఆమె నిర్వహిస్తున్న కళా ప్రదర్శిని నృత్యాలయం ద్వారా ఏటా ఘంటసాల జయంతి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో నిర్వహిస్తూ వివిధ రంగాల ప్రముఖులకు పురస్కారాలు ఇస్తూ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. ఘంటసాల స్వగ్రామం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చవటపల్లి.

సోమవారం చెన్నైలో అంత్యక్రియలు జరుగుతాయని ఘంటసాల పార్వతి తెలిపారు.

Tags:

Advertisement

Latest News

బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..! బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..!
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....
కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!
కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!
బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!