ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి –గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్

By Ravi
On
ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి –గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్

శంకర్ పల్లి04ఏప్రిల్ : సమాజంలో ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని గురువు యొక్క స్థానం గొప్పదని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం మాజీ ఉపాధ్యక్షులు గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ అన్నారు.గోపులారం పాఠశాలలో 12 సంవత్సరాలుగా పనిచేసే బదిలీపై వెళ్లిన గోపులారం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సామాజిక కార్యకర్త పాప గారి ఆశీర్వాదం,తెలుగు ఉపాధ్యాయులు వి వి బి లక్ష్మణ శాస్త్రి లను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా పొడవు శ్రీనివాస్ మాట్లాడుతూ ..  గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలలో పనిచేస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చక్కటి విద్య బోధనలు చేశారని అన్నారు. వారి బోధనలో ఎంతోమంది విద్యార్థులు విద్యను అభ్యసించారని, విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాల అభివృద్ధికి కృషిచేసారని అన్నారు.జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎం రామ్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిబాబా, పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ లతో కలిసి మాట్లాడుతూ 12 సంవత్సరాల కాలంలో ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు సమాజ నిర్మాణంలో విద్య యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునేలా తమ సేవలను అందించాలని ఇలా బదిలీపై వెళ్లడం బాధాకరమే గాని ఉద్యోగులకు తప్పదని అన్నారు. 
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పాపగారి ఆశీర్వాదం మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా గోపులారం పాఠశాల అభివృద్ధిలో విద్యార్థుల  తల్లిదండ్రులు , దాతలు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ,యువకులు మరియు ఐబీఎస్, ఐఎఫ్ ఎచ్ ఇ ఎంతగానో సహకరించారని ఇంతటి ఘన సన్మానం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలందరూ చక్కగా చదువుకొని మంచి క్రమశిక్షణతో మంచి అలవాట్లతో ఉన్నత స్థాయికి ఎదిగి మంచి పేరు తెచ్చేలా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మహారాజ్ పెట్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు అంజయ్య గోపులారం పాఠశాల ఉపాధ్యాయులు రాజు, బాలమణి, హేమలత, సరిత లతోపాటు మాజీ వార్డు సభ్యుడు చీమల సురేందర్ గ్రామ పెద్దలు మాణిక్య రెడ్డి,యువకులు నరసనోళ్ల రామచందర్,టీజీ రవి, చాకలి సత్తయ్య  విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!