ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుప్రమాదం..!
By Ravi
On
సికింద్రాబాద్ నుంచి హౌరా వెళుతున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. రైలు పలాస రైల్వేస్టేషన్ దాటిన వెంటనే సుమ్మదేవి రైల్వేస్టేషన్ సమీపంలో బోగీల మధ్య ఉన్న కప్లింగ్ విరిగిపోయింది. దీంతో ఇంజిన్‌తోపాటు 8 భోగీలు రైల్వేస్టేషన్‌కు చేరుకోగా.. మిగిలిన 15 బోగీలు సుమ్మాదేవి రైల్వేస్టేషన్ సమీపంలోనే నిలిచిపోయాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే ఉద్యోగులు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను మందస రోడ్డు దగ్గర నిలిపివేశారు. మరో ఇంజన్ సహాయంతో భోగీలను మందస రోడ్డుకు తీసుకొచ్చి విడిపోయిన వాటితో కలిపారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Related Posts
Latest News
16 Apr 2025 21:22:40
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...