ఉత్తమ లక్ష్యాలతో యువత అభ్యున్నతిని సాధించాలి

By Ravi
On
ఉత్తమ లక్ష్యాలతో యువత అభ్యున్నతిని సాధించాలి

ప్రభుత్వ విప్ యనమల దివ్య 

NV SURYA TUNI TPN

తుని పట్టణంలో రెండు నెలల వ్యవధిలో రెండవసారి జాబ్ మేళాను నిర్వహించారు వికాస ఆధ్వర్యంలో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో శనివారం ఏర్పాటు చేసిన మినీ జాబ్ మేళాను ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ఉత్తమ లక్ష్యాలతో అభ్యున్నతిని సాధించాలంటూ పిలుపునిచ్చారు జాబ్ మేళా సందర్భంగా ఇంటర్వ్యూ కి హాజరైన వారందరికీ ఉద్యోగాలు కల్పించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు నిరుద్యోగ యువతకు ఉపాధి  కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అభిమానులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును యనమల దివ్య కట్ చేసి విద్యార్థినులకు పంచారు చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు యనమల రాజేష్ రాజా అశోక్ బాబు మోతుకూరి వెంకటేష్ రాంబాబు రాజు యాక్టివ్ చైర్ పర్సన్ కుచ్చర్ల పాటి రూపాదేవి ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి  చోడిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!