కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!

By Ravi
On
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!

- నకిలీ సర్టిఫికెట్స్‌కు కేరాఫ్‌గా కడియం డాక్యుమెంట్ రైటర్స్‌
- బతికుండగానే డెత్ నర్టిఫికెట్స్‌
- 2014లో చనిపోతే.. 2007లో చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ 
- తవ్వేకొద్దీ బయటపడుతున్న రైటర్ల అవినీతి, అక్రమాలు
- కడియం సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో తప్పుడు రిజిస్ట్రేషన్స్‌
- సొమ్ముల కోసం ఎంతకైనా తెగిస్తున్న డాక్యుమెంట్ రైటర్స్‌
- రైటర్స్‌కు వత్తాను వలుకుతున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులు

కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ అవినీతికి నిలయంగా మారింది. డాక్యుమెంట్‌ రైటర్స్‌ అంతా సిండికేట్‌గా మారి.. సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ను అడ్డాగా చేసుకుంటున్నారు. తప్పుడు ధృవపత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్స్‌ చేయిస్తున్నారు. ప్రభుత్వం నిషేధం విధించిన సర్వేనంబరులోని భూముల్ని సైతం మార్చేసి రిజిస్ట్రేషన్స్‌ చేయించే డాక్యుమెంట్‌ రైటర్ల సిండికేట్‌ ముఠా గుట్టుని పాయింట్‌ న్యూస్‌ రట్టు చేసింది. కడియం మండలంలోని కడియం, వీరవరం, కడియపులంక, ధవళేశ్వరం వంటి అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను కడియం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్స్‌ చేసేస్తూ కోట్లు అర్జిస్తున్నారు. ఇక్కడ పనిచేసిన అనేకమంది సబ్‌రిజిస్ట్రార్లు కూడా కానులకు కక్కుర్తిపడి ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్లు చేశారు. అలాగే ఇక్కడ రైటర్లు జతచేస్తున్న డెత్‌సర్టిఫికేట్స్ కూడా పక్కా డూబ్లికేట్ అని తెలుస్తోంది. వీటిపై ఇప్పటికైనా కలెక్టర్, రిజిస్ట్రార్, విజిలెన్స్ శాఖలు దృష్టిసారిస్తే మాత్రం భారీ అవినీతి, అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. 

వీటిపై పాయింట్‌ న్యూస్‌ అనేక ఆధారాలను సంపాదించింది. త్వరలో ఈ అవినీతి, అక్రమాలపై వరున కథనాలు వెలువడనున్నాయి.  కొంతమంది కడియం డాక్యుమెంట్ రైటర్స్ నకిలీ సర్టిఫికేట్స్ తయారీకి కేరాఫ్‌గా మారారు. కడియం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి అత్యంత సమీపంలోనే సిండికేట్‌గా ఏర్పడిన ఈ డాక్యుమెంట్ రైటర్లు.. డెన్లు ఏర్పాటు చేసుకుని నకిలీ సర్టిఫికేట్స్‌ని తయారు చేయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై పూర్తి ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. గతంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కొలువు వెలగబెట్టి, ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్ల అవతారం ఎత్తడంతో.. వారు చేసే అక్రమాలు కూడా వందలాదిగా వెలుగుచూస్తున్నాయి. సంబంధం లేని భూమిని కూడా సొమ్ములిస్తే తమదిగా చూపించేందుకు ఎంతటి నకిలీ దస్త్రాలనైనా సృష్టించగలరు. సదరు డాక్యుమెంట్ రైటర్లు తయారుచేసే డాక్యుమెంట్ కోసం ఒక వ్యక్తిని బతికుండగానే చనిపోయినట్లు చూపిస్తారు. సదరు వ్యక్తి మరణించకుండానే డెత్ సర్టిఫికేట్ తెచ్చేస్తారు. ఒకటి, రెండు కాదు ఏకంగా వందలాది రిజిస్ట్రేషన్స్‌లో తప్పుడు ధృవీకరణ పత్రాలు జతచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇటీవల కడియం సబ్‌రిజిష్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన ఒక రిజిస్ట్రేషన్‌లో.. 2014లో మరణించినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పేర్కొని.. అదే వ్యక్తి 2007లో చనిపోయినట్లు పంచాయితీ కార్యాలయం నుంచి తప్పుడు డెత్‌ సర్టిపికేట్ తీసుకొచ్చారంటే.. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ల మాయాజాలం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ డెత్ సర్టిఫికేట్‌ని కూడా సదరు సబ్‌రిజిస్ట్రార్ గమనించలేదంటే.. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లు చేసే మేనేజ్‌మెంట్ ఏ లెవల్లో ఉందో తేటతెల్లమవుతోంది. ఇది కడియం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల చేసే మోసాల్లో ఒక ఉదాహరణ మాత్రమే. విచారిస్తే.. కొన్ని వందల ఇర్రెగ్యులర్ రిజిస్ట్రేషన్లు వెలుగుచూస్తాయి. ప్రభుత్వ భూములను కూడా జిరాయితీగా మార్చేసే డాక్యుమెంట్ రైటర్లు అనబడే.. సెటిల్‌మెంట్‌ దాదాలు ఇక్కడ చాలా మంది ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కడియం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఓ లుక్‌ వేస్తారా..? లేకుంటే.. ఎప్పటిలానే ఈ విషయాన్ని కూడా చూసీచూడనట్లు వదిలేస్తారా..? అన్నది చూడాలి.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!