ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకు షీ టీమ్స్ మరో ముందడుగు.
షీ టీమ్స్ సిబ్బందికి ఎలక్ట్రానిక్ పరికరాలు ( లాప్టాప్స్, పెన్ కెమెరాలు, ప్రొజెక్టర్స్, ప్రింటర్స్, సెల్ ఫోన్స్) పంపిణీ చేసిన కమిషనర్.
ఆకతాయిల వేదింపులను నియంత్రించడానికి, ప్రజలలో అవగాహన కల్పించడానికి నూతన టెక్నాలజీతో షీ టీమ్స్ మరో ముందడుగు: సీపీ సుధీర్ బాబు ఐపీఎస్.
ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ మహిళా రక్షణ కొరకు షీ టీమ్స్ నూతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మరింత వేగవంతంగా పనిచేయడానికి ఉపయోగపడేలా మరియు ఆకతాయిల వేధింపులను నియంత్రించడం కోసం ప్రజల్లో అవగహన కల్పించడానికి ఈ రోజు రాచకొండ కమిషనరేట్ నేరేడ్మెట్ నందు షీ టీమ్స్ సిబ్బందికి లాప్టాప్స్, పెన్ కెమెరాలు, ప్రొజెక్టర్స్, ప్రింటర్స్, సెల్ ఫోన్స్ వంటి సాంకేతిక పరికరాలు పంపిణీ చేయడం జరిగింది. మహిళా భధ్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఈ నూతన సాంకేతిక పరికరాలతో మరింత సమర్థవంతంగా పని చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ గారు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసిపి ఉమెన్స్ సేఫ్టీవింగ్ ఉషా విశ్వనాథ్, ఇన్స్పెక్టర్ ముని , ఇన్స్పెక్టర్ అంజయ్య , అడ్మిన్ ఎస్ ఐ రాజు మరియు షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.