అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి చిత్రకళ ప్రదర్శన

By Ravi
On
అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి చిత్రకళ ప్రదర్శన

  • విద్యార్థులను చేయి చేయి కలిపిన ఉత్సాహం నింపిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు,  మంత్రి దుర్గేష్.
  • రాష్ట్రంలో కళలకు, కళాకారులకి పూర్వ వైభవం.
  • ఇంత పెద్ద స్థాయిలో అమరావతి చిత్ర కళా ప్రదర్శనల్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు.
  • ముఖ్యమంత్రి గీసిన చిత్రాన్ని రూ.1,01,116 కు కొనుగోలు చేసిన డిప్యూటీ స్పీకర్ .
  • స్టాల్ల్స్ ను సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత

TPN, Sri Ch 
Rajamahendravaram, April 04

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయక్వం లో కళకు పూర్వ వైభవం వస్తుందన్న విశ్వాసం ఈ వేడుకల నిర్వహించడం ద్వారా తేటతెల్లం అయిందని శాసనసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ లు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సెంట్రల్ జైలు ప్రధాన రహదారి మార్గంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళ ప్రదర్శన ను అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు మాట్లాడుతూ,  చిత్ర కళా ప్రదర్శనల్ని వీక్షించేందుకు వొచ్చిన ఇక్కడ అందరూ నవ్వు తూనే వున్నరు. రాష్ట్రంలో కళలకి, కళాకారులకి పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుందని పేర్కొన్నారు.  కళలకి పుట్టినిల్లు అయిన రాజమహేంద్రవరం లో ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రతిపాదన,  అందుకు అనుగుణంగా ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి ఏర్పాటు చేసిన విధానం అభినందనీయం అన్నారు. అమరావతి చిత్ర కళా ప్రదర్శనల్ని ఎంతో స్పూర్తి వంతమైన విధానంలో ఏర్పాట్లు చేసిన తేజస్విని ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందనన్నారు. ఈ ప్రదర్శన చూడడం తొ పాటు కళలని, కళాకారులని ప్రోత్సహిస్తూ వాటిని కొనుగోలు చేయాలని కోరారు. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.  కళ ప్రదర్శనలకు అమరావతి పేరు పెట్టారు కదా అమరావతి లో పెడితే బాగుంటుంది అని నేను సూచిస్తే, రాష్ట్ర సాంస్కృతిక రాజధాని లో పెట్టడం సముచితం అని మంత్రి దుర్గేష్ సూచించడం జరిగిందన్నారు. రాజమండ్రీ సెంట్రల్ జైలు రోడ్ లో చాలా చెట్లు ఉన్నాయి...చాలా బాగుంది...ఇక్కడ చెట్లు బాగా పెరిగాయి.. ఈ చెట్లు నీ వదిలేసినoదుకు గత ముఖ్య మంత్రి కి కూడా మెచ్చుకోవాలి అంటూ ఉప సభాపతి చలోక్తి విసరడం తో కార్యక్రమం లో నవ్వులు విరబూసాయి.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,  దేశం లోనే విజన్ ఉన్న ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ల ఆలోచనలో ఇక్కడ అమరావతి చిత్ర కళా ప్రదర్శనల్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కళలనీ ప్రోత్సహిస్తూ కళాకారులకి పూర్వ వైభవం తీసుకుని వొచ్చేందుకు చిత్త శుద్ధి కలిగి ఉందన్నారు. ..ఇక్కడ కు అనేక మంది కళాకారులు వచ్చారు...ఆర్టిస్ట్ లకు పెట్టినవి  చూసి, వారి ప్రతిభను గుర్తించాలని,  వాటిని కొని కళాకారులకి  చేయూత ఇవ్వలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి అనివార్య  కారణాలు, ఇతర కార్యక్రమాల వలన రాలేక పోయారన్నారు. రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఒక మంచి అధికారి అని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా పనిచేస్తు, రాష్ట్ర పర్యటక శాఖ అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. చైర్ పర్సన్ తెజేస్వి అధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. 
ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ , కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతం అంటే గుర్తుకు వచ్చేలా .. కళలకి కణాచికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రన్నీ తీర్చి దిద్దేలా అడుగులు వేయడం జరుగుతోందనీ అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.
శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామ కృష్ణ లు మాట్లాడుతూ,  రాజమండ్రి నగరంలో ఇటువంటి కార్యక్రమాన్నీ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం కు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. అమరావతి అనే పేరు లోనే వైబ్రేషన్ వుందన్నారు. నిజం జీవితం లో మన రఘు రామ కృష రాజు గారు ఒక అల్లూరి సీతారామ రాజు వంటి పాత్ర పోషించడం చూడమన్నారు. గత ప్రభుత్వం హయంలో కళకి ప్రాధాన్యత ఇవ్వడం అటుంచి, ఇటువంటి కార్యక్రమాలు ఒక్కటి నిర్వహించలేదు అని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైను, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు డి మల్లికార్జునరావు,  పలువురు కళాకారులు అధికారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Image 2025-04-04 at 6.43.51 PM

Tags:

Advertisement

Latest News