ఎర్రవరం అవంతి కంపెనీలో ఫుడ్‌ పాయిజన్‌..!

By Ravi
On
ఎర్రవరం అవంతి కంపెనీలో ఫుడ్‌ పాయిజన్‌..!

కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం-పెద్దనాపల్లి గ్రామాల మధ్యలో నిర్మించిన అవంతి కంపెనీలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. ఐత.. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 35 మంది జగ్గంపేట రామచంద్ర ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు డీఎంహెచ్‌వో నరసింహ నాయక్, ఫుడ్ కంట్రోల్ ఇన్స్‌స్పెక్టర్‌ శ్రీనివాస్ జగ్గంపేట రామచంద్ర ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్న వారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ.. అవంతి కంపెనీలో శనివారం ఉదయం ఫుడ్ పాయిజన్ అయ్యి చికిత్స నిమిత్తం జగ్గంపేట రామచంద్ర ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. అయితే ఈ ఘటన సోమవారం ఉదయం కొంతమంది మీడియా మిత్రుల ద్వారా తెలిసినట్లు తెలిపారు. దీంతో హుటాహుటీనా తరలివచ్చామన్నారు. కంపెనీలో విచారణ చేయగా.. ముందురోజు 10 మంది వర్కర్స్ బయట నుంచి బిరియాని తెచ్చుకున్నారని.. అలాగే అక్కడ క్యాంటీన్‌లో తిన్న వారికి కూడా వాంతులు, విరోచనాలు అయ్యాయని తెలిపారు. అయితే ఫుడ్ పాయిజన్‌తో ఎవరికి ప్రాణాపాయం లేదన్నారు. వాంతులు, విరోచనాల తప్ప ఎవరికి ఏం కాలేదన్నారు. అయితే ఫుడ్‌ పాయిజన్ ఎలాగైందన్న అంశంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే అవంతి కంపెనీలో ఉన్న క్యాంటీన్ విషయంలో కూడా జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నది పరిశీలించి.. ఏదైనా తేడా వస్తే దాని లైసెన్స్ కూడా క్యాన్సిల్‌ చేస్తామని హెచ్చరించారు. స్థానిక రామచంద్ర ఆసుపత్రి వైద్యాధికారిని.. ఈ విషయం ప్రభుత్వ ఆసుపత్రికి తెలియపరిచారా అన్నదానిపై ఆరా తీయగా.. రాజపూడి పీహెచ్‌సీకి తెలియపరచడం జరిగిందని.. వారు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారని తెలిపారు.

Advertisement

Latest News

సురానా గ్రూప్ ఆఫ్‌ కంపెనీస్‌పై ఈడీ దాడులు..! సురానా గ్రూప్ ఆఫ్‌ కంపెనీస్‌పై ఈడీ దాడులు..!
సురానా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్ నరేందర్ సురాన, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లల్లో, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  మనీలాండరింగ్‌తోపాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణలు...
కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..!
కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులు.. వడగళ్ల బీభత్సం..!
ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..?
బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..! 
3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!
ఏసీబీ వలలో బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌..!