వికారాబాద్ జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
వికారాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు యాలాల్ మండలంలోని బాగాయిపల్లి చౌరస్తాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ భూమిలో అనుమానాస్పదంగా కనిపించిన ప్లాస్టిక్ సంచులను తనిఖీ చేయగా, వాటిలో నకిలీ విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని యాలాల్ పోలీసులకు అప్పగించారు.ఈ మేరకు వ్యవసాయ అధికారి ఏవో శ్వేత రాణి అందించిన సమాచారం ప్రకారం, స్వాధీనం చేసుకున్న నకిలీ విత్తనాల విలువ సుమారు రూ.44 లక్షలు, బరువు 22 క్వింటాళ్ళుగా ఉన్నట్లు అంచనా వేసారు.నిందితులు వివరాలు:
-
A1 నారాయణరెడ్డి – కొత్తకోట గ్రామం, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు)
-
A2 శివ నాగేశ్వరరావు – వృత్తి: వ్యవసాయం, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్
-
A3 దాసరి శ్రీనివాసరావు – గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఈ ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ప్రధాన నిందితుడు నారాయణరెడ్డి పరారీలో ఉన్నాడు.ఈ ఘటనపై జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి స్పందిస్తూ, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గుర్తుతెలియని వ్యక్తులు లేదా అనుమతి లేని డీలర్ల వద్ద నుంచి లేబుల్ లేని విత్తనాలు కొనవద్దని సూచించారు.ఈ ప్రత్యేక ఆపరేషన్‌కి నేతృత్వం వహించిన టాస్క్‌ఫోర్స్, తాండూర్ డీఎస్పీ, రూరల్ సీఐలను ఎస్పీ అభినందించారు. వారి సేవలను గుర్తించి రివార్డ్ కూడా ప్రకటించారు.