మహిళలకు రాష్ట్రం లో రక్షణ లేకుండా పోయింది

By Ravi
On
మహిళలకు రాష్ట్రం లో రక్షణ లేకుండా పోయింది

బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ @ తెలంగాణ భవన్ 


ఈ రోజు ఉదయం సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీస్ అధికారి తెలంగాణ భవన్ కు వచ్చారు  దిలీప్ కొణతం కు నోటీసులు ఇచ్చేo దుకు వచ్చానని చెప్పారు.  హెచ్ సీ యూ కేసుకు సంబంధించి పోస్టు పెడితే నిర్మల్ నుంచి పోలీసులు వచ్చారు. క్రిశాంక్ మీద కూడా కేసులు పెట్టారు బీ ఆర్ ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు యథేచ్ఛగా రేవంత్ రెడ్డి సూచనలతో పెడుతున్నారు అక్రమ కేసులను ఖండిస్తున్నాం మహిళలకు రాష్ట్రం లో రక్షణ లేకుండా పోయింది . గత వారం రోజుల్లోనే నలుగురు మహిళల పై అత్యాచార ఘటనలు జరిగాయి  మేడ్చల్ ఎం ఎం టీ ఎస్ మహిళా భోగిలో ఉన్నప్పటికీ మహిళ పై అత్యాచారం జరిగింది  సంగారెడ్డి కంది లో భర్తను కట్టేసి మహిళ పై అత్యాచారం జరిగింది.

నాగర్ కర్నూల్ లో ఓ గుడి దగ్గర మహిళ పై సామూహిక అత్యాచారం జరిగింది మార్చి 31 న జర్మనీ మహిళ పై పహాడీ షరీఫ్ లో అత్యాచారం జరిగింది. ఇన్ని అత్యాచారాలు జరగడం మామూలు విషయం కాదు హోం మంత్రి గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఉన్నారు ఇంత మంది పోలీసులు ఉన్నా ఇన్ని అత్యాచారాలు జరగడం ఏమిటీ ? ఘోరమైన ఘటనలు జరుగుతున్నా రేవంత్ రెడ్డి వాటిపై కనీసం సమీక్షలు పెట్టలేదు. 
మున్సిపల్ పాలన పై రివ్యూ లు పెడుతున్న సీఎం హోం శాఖ పై మాత్రం పెట్టడం లేదు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్న సీఎం శాంతి భద్రతల పై సమీక్ష పెట్టరా ? బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ హయం లో మహిళల రక్షణకు 331 షీ టీమ్ లు ఏర్పాటు చేశారు  11 లక్షల సీసీ కెమెరా లు పెట్టారు పోలీసు వ్యవస్థ ఆధునీకరణ కు 770 కోట్ల కేసీఆర్  వెచ్చించారు. పోలీసులు డయల్ 100 కు ఫోన్ చేసినా ఇపుడు స్పందించడం లేదు పోలీసులు తమ ద్రుష్టి నంతా బీ ఆర్ ఎస్ నేతల పై కేసులు పెట్టడం పై ద్రుష్టి పెట్టారు రేవంత్ పాలన లో పోలీసులంటే ప్రజలకు క్రమంగా నమ్మకం పోతోంది.  మహిళలకు రక్షణ కల్పించమంటే రేవంత్ రెడ్డి హెచ్ సీ యూ లో నాలుగు వందల ఎకరాలు ఆక్రమించేందుకు పోలీసులను పంపారు అక్కడ కూడా విద్యార్థినుల పై పోలీసులు లాఠీలు ప్రయోగించారు బీ ఆర్ ఎస్ నేతలు ప్రభుత్వ హామీలు అమలు చేయాలనీ అడిగితే కేసులు పెట్టారు చిన్నారుల మీద అత్యాచారాలు చేసిన వారికి శిక్షలు కూడా పడటం లేదు కమాండ్ కంట్రోల్ లో కూర్చుంటే కుదరదు సీఎం గారూ ?అత్యాచార భాదితులను హోమ్ మంత్రిగా రేవంత్ రెడ్డి పరామర్శించాల్సింది మహిళా కమిషన్ ఏం చేస్తోంది ?అత్యాచార ఘటనలకు సంబంధించి పోలీసులకు మహిళా కమిషన్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదు  సీఎం ,మహిళా కమిషన్ మౌనం లో అర్థం ఏమిటీ ? మహిళలమీద అత్యాచారాలు జరుగుతున్నా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టకపోవడం ఏమిటీ ? ప్రభుత్వం ద్రుష్టి అంతా బీ ఆర్ ఎస్ నేతలను జైలు కు పంపడం పైనే ఉంది  ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేయక మహిళలకు మోసం చేశారు ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మహిళలకు రక్షణ కూడా ఇవ్వలేక పోతోంది  గతం లో దిశ కేసులో కేసీఆర్ కఠినంగా శిక్షించారు  అత్యాచార నిందితులను ఉరికంబం ఎక్కించినా తప్పులేదు  నాలుగు అత్యాచార ఘటనలకు సంబంధించి తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి నిందితులను శిక్షించాలి రేవంత్ రెడ్డి మాటలు చెబితే సరిపోదు ..మహిళలకు రక్షణ ఇవ్వాలి తెలంగాణ లో జైళ్ల సామర్ధ్యం ఏడు వేల మంది తెలంగాణ లో దాదాపు నాలుగు కోట్ల జనాభా ఉంది .బీ ఆర్ ఎస్ కు లక్షలాది మంది సైన్యం ఉంది రేవంత్ రెడ్డి ఎంత మంది మీద కేసులు పెట్టినా ప్రజల గొంతుక గా పనిచేస్తాం కాంగ్రెస్ నేతలు రాజకీయంగా ఎదురు దాడి చేయడం కాదు మేము లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ నేతలు చిరుమళ్ల రాకేష్ కుమార్ ,అభిలాష్ రంగినేని ,తుంగబాలు ,అరుణ పాల్గొన్నారు .

Tags:

Advertisement

Latest News

తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామక ప్రక్రియపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం...
పాఠశాల గదుల నిర్మాణాలకు అడ్డువస్తే సహించేది లేదు. ఆకుల సతీష్
మిస్ వరల్డ్ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. డీజీపీ జితేందర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్
ట్రంప్‌ చర్చలపై చైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పాకిస్తాన్‌ పై ఆర్థిక దాడులకు ప్లాన్ చేస్తున్న భారత్..
వేలాది మదర్సాలను మూసేస్తున్న పాకిస్తాన్..