తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న దళిత  వైసీపీ నాయకులు, పార్టీలోకి ఆహ్వానం పలికిన వర్మ

By Ravi
On
తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న దళిత  వైసీపీ నాయకులు, పార్టీలోకి ఆహ్వానం పలికిన వర్మ

R.srinubabu.pithapuram.
TPN.
కాకినాడ జిల్లాపిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం గోకివాడ గ్రామం,జగపతిరాజపురం చెందినాబూత్ కన్వీనర్ శ్రీ మడికి రవి ఆధ్వర్యంలో వైసిపి కి చెందినా దళితలు, వార్డు మెంబెర్ గాందరపు లక్ష్మణరావు మిత్ర బృందం సుమారుగా 30 మంది దళిత యువత  వై. సి. పి. పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మేల్యే ఎస్వీఎస్ వర్మ  వీరి అందరికీ  తెలుగుదేశం  పార్టీ కండువా   కప్పి పార్టీలోకి మనస్పూర్తిగా  ఆహ్వానించడం జరుగుతుంది.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయకత్వం మెచ్చి, అదే విధంగా పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై రావడం జరిగిందని తెలిపారు. వీరికి ఏ కష్టం వచ్చిన, ఏ ఇబ్బందులు ఉన్న  తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్బంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు సకుమళ్ళ గంగాధర్ రావు, గ్రామాకమిటీ అధ్యక్షులు నామ పద్దరాజు, నామ లక్ష్మీనారాయణ, గాందారపు లక్ష్మణ రావు, మడికి బాబ్జి మరియు ఎలుబండి వెంకటరమణ, నుతాటి ప్రకాష్ పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News