శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
By Ravi
On
ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ యందు గల ఎస్టి కాలనీ నందు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి గౌరవనీయులు శ్రీ కాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాటర్ పైపులైను ఏర్పాటు చేసి ఆ కాలనీవాసులకు నీళ్లు సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు విజయకుమార్ మాట్లాడుతూ గత రెండు నెలలకు ముందు రాజీవ్ నగర్ నందు రెండు బోర్లు కూడా వేయడం జరిగిందని తొందర్లో రాజీవ్ నగర్ నందు మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ, శేఖర్, రాజీవ్ నగర్ కాలనీ వీఆర్వో రాజీవ్ నగర్ వాసులు గురవయ్య ,సురేష్ , అమరావతిమ్మ , తులసమ్మ, అరుణ్, శివ ,చెంచయ్య, రమేష్,ఎస్టి కాలనీవాసులు పాల్గొన్నారు
Latest News
18 Apr 2025 14:28:16
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...