వడదెబ్బకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

By Ravi
On
వడదెబ్బకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

హనుమకొండ : వేసవిలో వడదెబ్బకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ప్రజలకు సూచించారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వేసవిలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ తరఫున జిల్లాలో 21వ తేదీన  వైద్యాధికారులు, పల్లె దవాఖాన వైద్యులు, ఎంఎల్ హెచ్సీలతో జిల్లా స్థాయిలో సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. వైద్యాధికారులు పని చేస్తున్న చోట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, వడదెబ్బకు గురికాకుండా నివారణ చర్యలు చేపట్టి తగిన చికిత్సకు సంబంధించిన విషయాలను కూడా వారికి అవగాహన కల్పించాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బందితో పాటు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి అంగన్వాడీ, సెర్ప్ ఐకేపీ వారితో కూడా సమావేశాన్ని నిర్వహించి, ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్న ప్రదేశాలలో ఓఆర్ఎస్ పాకెట్లు అందించే విధంగా చేయడంతోపాటు షెడ్ నెట్ ద్వారా  నీడ సౌకర్యాన్ని కల్పించాలని కోరినట్లు తెలిపారు.  గ్రామాలలో ఆశా కార్యకర్తల ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లను  పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 6 గంటలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లి 11:30 లోపు ఇంటికి వస్తే బాగుంటుందని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తల పైన తెల్లటి రుమాలు,   లేకపోతే క్యాప్ లాంటివి ధరించాలని, వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. తాగునీరు అధికంగా తీసుకోవాలని కోరారు.  వడదెబ్బ తగలకుండా ఆరోగ్యం పట్ల ఇటువంటి జాగ్రత్తలు పాటించాల్సిందిగా ప్రజలకి సూచించారు.  ప్రతి ప్రాథమిక కేంద్రాల్లో ఇంతకు ముందు నుండి కూడా కూలర్స్ పనిచేసేలా చూస్తున్నామని, వడదెబ్బ గురైన వారు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారికి వైద్య చికిత్స అందిచడంతో పాటు టెంపరేచర్ తగ్గేటట్లు కూలర్ ను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. వడదెబ్బ కారణంగా  ఎవరైనా మరణించినట్లయితే తహసీల్దార్, ఎస్సై, డాక్టర్లతో కూడిన త్రిసభ్య కమిటీ విచారించి నివేదిక ఇస్తారని అన్నారు. ఇచ్చిన నివేదిక ను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు. వడదెబ్బ కు గురైన వారికి తలనొప్పి, తీవ్రమైన జ్వరం, నాలుక ఎండిపోవటం,  దాహం వేయడం,  మగతా లేదా నిద్ర లాంటి స్థితి, వాంతులు, పూర్తి ఆపస్మారక స్థితిలో ఉండడంలాంటి లక్షణాలు ఉన్నవారిని వెంటనే చల్లని ప్రాంతానికి చేర్చాలని,  చల్లని నీటిలో ముంచిన క్లాత్ లతో తూడవాలని సూచించారు. సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా జిల్లాలో 3లక్షలకు పైగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వడదెబ్బ  బారీన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భం గా కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్  రవీందర్ మాట్లాడుతూ  వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహిన్నస్తుట్లు తెలిపారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముఖ్యమైన 42 చోట్లలలో  చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.  నగర పాలక సంస్థ పరిధిలో పనిచేసే కార్మికులకు వేసవి దృష్ట్యా పనివేళల్లో మార్పు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఎక్కువగా ఎండలో కార్మికులు పనిచేయకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ జి. వి. భానుప్రసాద్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..! రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
సికింద్రాబాద్‌ TPN:  సికింద్రాబాద్‌లో ఒకే రోజు రెండు చోట్ల భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను రైల్వే పోలీసులు రిమాండ్‌కు తరలించారు....
అఘోరీ కోసం పోలీసులు వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి