మహిళా ఉద్యోగినుల కోసం మెడికల్ క్యాంపును ప్రారంభించిన డిజిపి  డాక్టర్ జితేందర్ ఐపీఎస్

By Ravi
On
మహిళా ఉద్యోగినుల కోసం మెడికల్ క్యాంపును ప్రారంభించిన డిజిపి  డాక్టర్ జితేందర్ ఐపీఎస్

పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిల కోసం నిర్వహించిన మెడికల్ క్యాంపును డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  డాక్టర్ జితేందర్ ఐపీఎస్ గురువారం నాడు డిజిపి కార్యాలయంలో ప్రారంభించారు.గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన మెడికల్ క్యాంప్‌లో పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిలు వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ.... మహిళా ఉద్యోగినిల కోసం నిర్వహించిన మెడికల్ క్యాంపు ద్వారా మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.మహిళలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం, వ్యాధులను ముందుగా గుర్తించడం ఎంతో అవసరమన్నారు. మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు అధునాతనమైన పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ  ముందుగానే వ్యాధులను గుర్తించనట్లయితే  భవిష్యత్తులో  ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.నేటి వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందనీ ,మహిళలకు అవసరమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు .అధునాతన వైద్య సాంకేతికత ద్వారా సమస్యలను తొందరగా గుర్తించి, సమయానికి సరైన వైద్యం చేయాల్సి ఉందన్నారు. ప్రత్యేకంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలనీ,కనీసం ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరమన్నారు.

ఈ మెడికల్ క్యాంపును విజయవంతంగా నిర్వహించిన గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. డైరెక్టర్ జనరల్, సిఐడి శ్రీమతి శిఖా గోయల్ ఐపిఎస్, శాంతి భద్రతల అదనపు డిజిపి శ్రీ మహేష్ ఎం భగవత్, ఐజిపి ఎం రమేష్, ఆరోగ్య భద్రత  కార్యదర్శి శ్రీ గోపాల్ రెడ్డి, డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి, ఏఐజి  సిఓఓ కాప్రి జలోట, మిద్దె లోకేష్ తదితరులు మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం  రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు
తుమ్మలూరు వద్ద రోడ్డుప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు