భారీ వర్షానికి నీట మునిగిన చాదర్ ఘాట్ రైల్వే బ్రిడ్జి రహదారి.. అంబులెన్స్ కి దారిచ్చిన జర్నలిస్ట్
By Ravi
On
సిటీలో కురిసిన భారీ వర్షానికి చాదర్ ఘాట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరుకుంది. ఆ నీటిలో ఆర్టీసీ బస్ చిక్కుకుపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసి అధికారులు నీటిని తోడే పనిలో పడ్డారు. సరిగ్గా అదే సమయానికి పేషంట్ తో దూసుకు వచ్చిన అంబులెన్స్ కి దారి లేకుండా పోయింది. అక్కడే స్పాట్ కవర్ చేస్తున్న జర్నలిస్ట్ సర్వర్ వెంటనే కొత్తగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ రహదారికి అడ్డుగా ఉన్న డ్రమ్ములు, తాళ్లు తొలగించి అంబులెన్స్ కి దారి చూపించాడు. సర్వర్ చేసిన పనికి ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు శభాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
Tags:
Latest News
19 Apr 2025 17:55:41
హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...