సిపిఐ 25వ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి- సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ.
TPN RAJASEKHAR
SRIKAKULAM
Date 3/4/25
సోంపేటలో మే 8, 9 తేదీలలో జరిగే సిపిఐ 25వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. ఈ సందర్భంగా సోంపేటలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీడి, మామిడి పంటకు 80 కేజీల బస్తాకు 16 వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని , గత కొంతకాలంగా జీడి రైతాంగం దశలవారీగా పోరాటాలు చేస్తున్నప్పటికీ పాలక ప్రభుత్వాలు స్పందించడం లేదని అన్నారు. ఈ సీజన్ లోనే జీడికి 16 వేల రూపాయలు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటుచేసి గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాగా ప్రకటించి 1/70 చట్టం అమలు చేయాలని, గిరిజనులకు పోడు పట్టాలు గిరిజనులు సాగులో ఉన్న బంజర భూములకు పట్టాలు ఇవ్వాలని, జీవో నెంబర్ 3 అమలు చేయాలని, గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని, గిరిజన గ్రామాలలో విద్య,వైద్యం, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వంశధార రిజర్వాయర్ పనులు పూర్తిచేసే చివరి భూములకు నీరు అందించాలని, వంశధార కాలువను ఆధునికరించి కాలువకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు సాలిన నారాయణస్వామి పాల్గొన్నారు.