అమెరికా పర్యటనలో ఎమెల్యే కూన రవి కుమార్
డల్లాస్లో గూగుల్ ఆఫీస్ సందర్శన
ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు & రాష్ట్ర పియుసి కమిటీ చైర్మన్ శ్రీ కూన రవి కుమార్ గారి అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ లో ఉన్నటువంటి గూగుల్ ఆఫీస్ వారి ఆహ్వానం మేరకు గూగుల్ ఆఫీస్ ని సందర్శించి ప్రస్తుత కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత క్రియాశీలంగా మరియు వేగంగా దూసుకుపోతున్నటువంటి AI టెక్నాలజీ విశిష్టత కోసం గూగుల్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ తో విశ్లేషించడం మరియు AI టెక్నాలజీని ఉపయోగించుకుని రాష్ట్రాన్ని విద్యా,వైద్య,సాఫ్ట్ వేర్ అన్ని రంగాల్లో ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేసుకోవాలని దీనికి సంబంధించి ఇంజనీరింగ్, IT, AI రంగాలు కోసం గూగుల్ కంపెనీకి చెందిన పలువురు నిపుణులతో మాట్లాడడం జరిగింది.
సాఫ్ట్వేర్ రంగ ప్రాముఖ్యత,సాధిస్తున్న అభివృద్ధిని కొనియాడుతూ తెలుగువారు సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఉండటానికి హర్షిస్తూ సీనియర్ డైరెక్టర్ లను కలుసుకొని పలు అంశాలపై మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా పలువురు NRI లను కలుసుకొని గత సైకో వైసీపీ ప్రభుత్వం సాఫ్ట్వేర్ రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో నాశనం చేసిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని అన్ని రకాలుగా సాఫ్ట్వేర్ కంపెనీలకి అనుకూలమైన వాతావరణ కల్పించారని పలు రాయితీలు ఇస్తున్నారని ఉత్తరాంధ్రలోని వైజాగ్ ప్రాంతం సాఫ్ట్వేర్ రంగానికి ఎంత అనుకూలమైన ప్రాంతంగా ఉందని విశాఖపట్నం సిటీలో ప్రస్తుతం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయంటే అది సీఎం చంద్రబాబు నాయుడు గారు & నారా లోకేష్ గారు చలువని భవిష్యత్తులో ఇంకా పూర్తిస్థాయిలో వీలైనంత ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రారంభించాలని ఆంధ్ర రాష్ట్ర యువతకి ఉపాధి కల్పించాలని ఎన్నారైలకు విజ్ఞప్తి చేశారు.