దేశంలో మొట్టమొదటిసారిగా చందువా చేప పిల్లల హేచెరీ

 సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో శ్రీ వైభవ్ హేచరిస్ ఎం ఓ యు

By Ravi
On
దేశంలో మొట్టమొదటిసారిగా చందువా చేప పిల్లల హేచెరీ

కాకినాడ జిల్లా తొండంగి మండలం దానవాయి పేటలో చందువా  చేపల సాగుపై అవగాహన సదస్సు జరిగింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( సీఎం ఎఫ్ ఆర్ ఐ ) ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు ఈ సదస్సు నిర్వహించారు శ్రీ వైభవ్ హేచరీ ఎండి బేటే చంద్రశేఖర్ తో కుదుర్చుకున్న ఎం ఓ యు ను ప్రదర్శించారు సీఎం ఎఫ్ ఆర్ ఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ జోకే కిజహకుడన్ మాట్లాడుతూ సుమారు 17 సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపి చందువ సీడ్ (చేప పిల్లలు) ప్రత్యుత్పత్తి  చేయడం జరిగిందని తెలిపారు మూడు నెలల సాగులో 750 గ్రాముల వరకు చేపల పెరుగుదల ఉంటుందన్నారు. నిరోధక శక్తి కలిగి ఉండడమే కాకుండా భారత దేశపు వాతావరణానికి అనుకూలంగా చేపల పెరుగుదల ఉంటుందన్నారు చందువా చేపకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని తెలిపారు. సీనియర్ సైంటిస్ట్ బి జి జేవియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జయశ్రీలోక డాక్టర్ రితీష్ రంజన్ డాక్టర్ శేఖర్ మహర్జన్ చంద్రశేఖర్ కుమారుడు కపిల్ విఖ్యాత్ అధిక సంఖ్యలో ఆక్వారైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-02 at 4.39.35 PM

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..