ఫైరింగు చేయుటలో లక్ష్యం గురి తప్పకూడదు

By Ravi
On
ఫైరింగు చేయుటలో లక్ష్యం గురి తప్పకూడదు

 విజయనగరం జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్

వార్షిక ఫైరింగు ప్రాక్టీసులో పాల్గొన్న జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు ఫైరింగు ప్రాక్టీసులో టార్గెటెడ్ లక్ష్యాన్ని సాధించుటలో ఒత్తిడిని జయించాలన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులకు వార్షిక ఫైరింగు ప్రాక్టీసును నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్దగల జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఏప్రిల్ 3న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ముఖ్య అతిధిగా హాజరై, అధికారుల ఫైరింగు ప్రాక్టీసును పర్యవేక్షించి, ఫైరింగు ప్రాక్టీసులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - పోలీసు అధికారుల ఫైరింగు నైపుణ్యం మెరుగుపర్చేందుకు ప్రతీ ఏడాది ఫైరింగు ప్రాక్టీసు నిర్వహించడన్నది ఒక సాధారణ ప్రక్రియ అని అన్నారు. ఈ ప్రక్రియను క్రమం తప్పకుండా నిర్వహించడం వలన పోలీసు అధికారులు ఆయుధాలను సమర్ధవంతంగా వినియోగించే నైపుణ్యం మెరుగుపడుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, రక్షణ చర్యలు చేపట్టడంలో ఫైరింగు ప్రాక్టీసు ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. ఆయుధాల నిర్వహణలో పరిజ్ఞానం
మెరుగుపర్చుకోవడం, శారీరక, మానసిక సమతౌల్యం సాధించడం, ఒత్తిడిలో కూడా సరిగ్గా లక్ష్యాన్ని చేధించడం, నియంత్రణలో ఉండేలా ప్రాక్టీసు అవసరమని అధికారులకు జిల్లా ఎస్పీ దిశా నిర్ధేశం చేసారు. అనంతరం, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పిస్టల్, గ్లాక్ పిస్టల్ మరియు ఎంపి4 వంటి అధునాతన ఆయుధాలతో ఫైరింగు ప్రాక్టీసు చేసి, ఇతర పోలీసు అధికారుల ఫైరింగు ప్రాక్టీసును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పర్యవేక్షించారు.

ఈ ఫైరింగు ప్రాక్టీసులో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, జి.భవ్యరెడ్డి, ఎం.వీరకుమార్, ఎస్.రాఘవులు, పలువురు సిఐలు, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!