శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!

శేఖర్, తిరుపతి TPN : శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్‌గా మాజీ కౌన్సిలర్ నాగమల్లి దుర్గాప్రసాద్‌ను నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి ప్రకటించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో చర్చించి నియామకాన్ని ఖరారు చేశారు. మీడియాకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునేలా బాధ్యతలు అప్పగించారు. సౌమ్యుడు, వివాదారహితుడు తెలుగు యువత పట్టణ అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం నేపథ్యంలో.. మీడియా మిత్రులతో సన్నిహిత సంబంధాలు ఈ పదవి రావడానికి కారణమయ్యాయి. మీడియా కోఆర్డినేటర్‌గా ఎన్నికైన దుర్గాప్రసాద్‌ను శ్రీకాళహస్తి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పలువురు ఘనంగా సత్కరించారు. అనంతరం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు ఎమ్మెల్యే కార్యక్రమానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తానని తెలిపారు. అలాగే విలేకరుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని.. పాత్రికేయల అభివృద్ధికి, సంక్షేమానికి సాయం చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే అప్పగించిన ఈ బాధ్యతలను అంకితభావంతో సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
Latest News
