ద్రోహానికి ,వంచనకు మారు పేరు కాంగ్రెస్ ప్రభుత్వం.

By Ravi
On
ద్రోహానికి ,వంచనకు మారు పేరు కాంగ్రెస్ ప్రభుత్వం.

శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి 


ద్రోహానికి ,వంచనకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ ,కాంగ్రెస్ ప్రభుత్వం .
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలను మభ్యపెట్టింది .
బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ,సంవత్సరానికి బడ్జెట్ లో 20 వేల కోట్లు ,బీసీ సబ్ ప్లాన్ అంటూ కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతిపాదించారు .
ఏ ఒక్కటి అమలు కాలేదు .
బడ్జెట్ లో పోయిన సారి 9 వేల కోట్లు కేటాయించారు ..ఖర్చు చేసింది తక్కువ .
ఈ సారి 11 వేల కోట్లు కేటాయించారు .ఎంత ఖర్చు చేస్తరో తెలియదు .
కోర్టు చెబితే డెడికేటెడ్ కమిషన్ వేసి కులగణన చేశారు .అది కూడా తప్పుల తడక .
42 శాతం రిజర్వేషన్ల బిల్లు కు రాష్ట్ర ఉభయ సభల్లో అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి .
తొమ్మిదో షెడ్యూల్ లో చేరిస్తేనే దీనికి చట్టబద్దత వస్తుంది .
అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళతా అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి నిలుపుకోలేదు .
రాహుల్ గాంధీ కేంద్రం పై ఒత్తిడి తెస్తేనే 42 శాతానికి చట్టబద్దత వస్తుంది .
రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ఏ ప్రయత్నం చేసినా బీ ఆర్ ఎస్ సహకరిస్తుంది .
రాష్ట్రం లో అప్పులు తప్పులు రెండూ పెరిగాయి .
అపుడు హైడ్రా తో విద్వంసం ..ఇపుడు హెచ్ సీ యూ లో విద్వంసం .
లగచర్ల లో రైతుల పై దౌర్జన్యం చేసినట్టే ఇపుడు విద్యార్థుల పై దాడులు చేస్తున్నారు .
కేసీఆర్ హరిత హారం చేపడితే రేవంత్ రెడ్డి హరిత హననం చేస్తున్నారు .
లంగ్ స్పేస్ గా పని చేస్తున్న హెచ్ సీ యూ భూములను ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దు .
కేసీఆర్ హయం లో అటవీ విస్తీర్ణం ఏడు శాతానికి పైగా పెరిగితే రేవంత్ దాన్ని తగ్గించాలని చూస్తున్నారు .
హెచ్ సీ యూ భూముల పై విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీ ఆర్ ఎస్ మద్దతు ఉంటుంది .
బీసీ కమిషన్ సభ్యుడు కె .కిషోర్ గౌడ్.
బీసీ ల విషయం లో కాంగ్రెస్ తప్పుల మీద తప్పులు చేస్తోంది .
42 శాతం రిజర్వేషన్ల పై చట్టం చేసి చేతులు దులుపుకున్నారు .
ఢిల్లీ లో జంతర్ మంతర్ దీక్ష కు రాహుల్ గాంధీ ,ఖర్గే రాకపోవడం ఏమిటీ ?.
పార్లమెంటు కు కూత వేటు దూరంలో ఉన్నా జంతరమంతర్ కు రాహుల్ ఖర్గే రాలేదంటే బీసీ లపై కాంగ్రెస్ కున్న చిత్తశుద్ధి ఏమిటో తెలిసి పోయింది .
బీసీ ల రిజర్వేషన్లకు సంబంధించి బిల్లును గవర్నర్ తో ఆమోదింపజేసి జీవో ఇచ్చే అవకాశమున్నా ఆ పని రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు .
కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్న చాలా అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా వాటిని అమలు చేయడం లేదు .
బీసీ లను కాంగ్రెస్ మోసం చేస్తున్న అంశం పై బీ ఆర్ ఎస్ ఎప్పటికపుడు ఎండగడుతూనే ఉంటుంది .
ఈ ప్రెస్ మీట్ లో నందికంటి శ్రీధర్ ,రాజీవ్ సాగర్ ,పురుషోత్తం ,మాధవ్ పాల్గొన్నారు .

Tags:

Advertisement

Latest News

నిర్మాణంలో ఉన్న భవనం వద్ద అల్యూమినియం సెంట్రింగ్ చోరీ.. 7గురు అరెస్ట్ నిర్మాణంలో ఉన్న భవనం వద్ద అల్యూమినియం సెంట్రింగ్ చోరీ.. 7గురు అరెస్ట్
నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద అల్యూమినియం సెంట్రింగ్ పానెల్స్ ను దొంగిలిస్తున్న ముఠాను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లి లో...
రాచకొండ కమిషనరేట్ లో సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు
హిమాయత్ నగర్ లో పోలీసుల దాడి.. ముగ్గరు బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
కీలక ఒప్పందంపై సంతకం చేసిన ఉక్రెయిన్‌, అమెరికా
అమెరికా విదేశాంగ కార్యదర్శి కీలక సూచన..
ఇజ్రాయెల్‌ లో భయంకర కార్చిచ్చు.