పాత బార్ స్థానంలో కొత్త బార్ కు లైసెన్స్ కు దరఖాస్తులు ఆహ్వానం
- గడువు చివరి తేదీ ఈ నెల 26 వరకు..
- తెలంగాణలో గతంలో అనుమతి ఇచ్చినటువంటి 40 బార్లకు వివిధ కారణాలతో మూసివేతకు గురయ్యాయి.
వీటి లైసెన్సులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసిన 40 బార్లను కు పునరుద్ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చేవూరి హరికిరణ్ నోటిఫికేషన్ బార్ల పునరుద్ధరణ నోటిఫికేషన్లు విడుదల చేశారు. తెలంగాణలో ఆదిలాబాద్ లో 5, కరీంనగర్ లో ఒకటి, వరంగల్లో నాలుగు, ఖమ్మంలో రెండు, నల్లగొండలో ఒకటి, మహబూబ్నగర్లో ఐదు, మెదక్ లో ఒకటి, నిజామాబాదులో 4 రంగారెడ్డి జిల్లాలో రెండు బార్లు ను పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో 15 బార్లకు దరఖాస్తులను తీసుకోవడం లేదు. తెలంగాణ రూరల్ జిల్లాల్లో 25 బార్లకు నోటిఫికేషన్లు ఇచ్చారు. మీర్పేట్ మున్సిపాలిటీలో పాత బార స్థానంలో కొత్త బారును కు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు కోరుతున్నామని సరూర్నగర్ ఎక్సైజ్ సూపర్ ఎడిండెంట్ ఉజ్వల రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుకు రూ. లక్ష. బారు లైసెన్స్ ఫీజు రూ. 42 లక్షలుగా ఉంటుందని పిఎస్ తెలిపారు. రంగారెడ్డి డివిజన్లో వికారాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పాత బార స్థానంలో కొత్త బార్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ తెలిపారు. దరఖాస్తు రూపాయలు లక్ష, సంవత్సరం ఫీజు రూ.30 లక్షలు గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.