ఎప్రిల్ 1 నుండి పార్కింగ్ వసూళ్లపై నియంత్రణ: నేషనల్ కంజూమర్ రైట్స్ కౌన్సిల్ నిర్ణయం
శ్రీకాకుళం, మార్చి 29, 2025: నేషనల్ కంజూమర్ రైట్స్ కౌన్సిల్ ద్వారా తీసుకున్న తాజా నిర్ణయంతో, 2025 ఏప్రిల్ 1 నుండి షాపింగ్ మాల్స్ మరియు సినిమా థియేటర్ల వద్ద పార్కింగ్ రుసుములను చట్టరీత్యా నేరంగా ప్రకటించనుంది. ఇది వినియోగదారుల హక్కులను పలు విధాలుగా రక్షించేందుకు న్యాయ పోరాటంలో వికాస్ పాండే జట్టు సాధించిన గొప్ప విజయం.
ఈ సందర్భంగా, నేషనల్ కంజూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే తెలిపారు, "పార్కింగ్ రుసుముల కోసం వసూలు చేసిన అదనపు చార్జీలపై ప్రజలపై ఆర్థిక భారం పెరిగిపోతుంది. న్యాయస్థానం ద్వారా ఈ సమస్యపై మార్పు సాధించడంతో ప్రజలకు చాలా ఉపయోగకరమైన ఫలితాలు సాధించబడ్డాయి. ఇది ప్రభుత్వంతో సమన్వయంతో చేసిన పెద్ద విజయమని అన్నారు."
శ్రీకాకుళం జిల్లా కంజూమర్ రైట్స్ జడ్జి, చిరంజీవి మాట్లాడుతూ, "ముఖ్యంగా వాణిజ్య సంస్థలు, మల్టీప్లెక్స్ లలో పార్కింగ్ రుసుములు వసూలు చేయడం ప్రజల హక్కులకు విరుద్ధం. ఈ సమస్యపై అవగాహన పెంచేందుకు నేషనల్ కంజూమర్ రైట్స్ కౌన్సిల్ బృందం చేసిన పోరాటం ముఖ్యమైనది" అని పేర్కొన్నారు.
ఇతర వివరాలు:
-
ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఈ నిర్ణయాన్ని జీవో ఎంఎస్ నెంబర్ 44 ద్వారా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
-
కొత్త ఉత్తర్వుల ప్రకారం, పార్కింగ్ కోసం ఫీజు వసూలు చేయడాన్ని ఒక గంట వరకు ఉచితం చేస్తుంది.
-
షాపింగ్ మాల్స్ లేదా మల్టీప్లెక్స్ లలో పార్కింగ్ రుసుములు వివరాలు మరియు షాపింగ్ రుజువు లేకుండా వసూలు చేయబడదు.
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ ఆదేశాలను ఏపీ కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనుసరించి విధి ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ కంజూమర్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు దన్నాన మదన్, వైస్ ప్రెసిడెంట్ యస్. లక్ష్మి పతి, సెక్రటరీ సత్యవరపు లక్షన్, డిప్యూటీ సెక్రటరీ మజ్జి. సుమన్, న్యాయవాది తంగి. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.