66 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.3.3 కోట్లు ఎక్స్ గ్రేషియా విడుదల

◉ గతంలో 103 మందికి రూ.5.15 కోట్లు చెల్లింపు

By Ravi
On
66 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.3.3 కోట్లు ఎక్స్ గ్రేషియా విడుదల

  • 66 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.3.3 కోట్లు ఎక్స్ గ్రేషియా

  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో 169 మందికి రూ.8.45 కోట్లు చెల్లింపులు

  • 103 మందికి రూ.5.15 కోట్లు చెల్లింపులు గతంలో

  • సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలపై అనిల్ ఈరవత్రి, కె. రామకృష్ణా రావు సమన్వయంతో నిధుల విడుదల.

WhatsApp Image 2025-03-28 at 3.58.12 PMనవంబర్ 3, 2023: ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, 66 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.3.3 కోట్లు ఎక్స్ గ్రేషియా (ఆర్ధిక సహాయం) విడుదల చేయబడ్డట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు **మాజీ ఎమ్మెల్యే ** అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

వారసులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా సొమ్మును శుక్రవారం వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు పేర్కొన్నారు.

సీఎం ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక, ప్రణాళిక) కె. రామకృష్ణా రావుతో సమన్వయంతో నిధులు విడుదల చేయించినట్లు అనిల్ వివరించారు.

నిబంధన ప్రకారం, ఈ మొత్తాన్ని నిజామాబాద్ (28), జగిత్యాల (19), కామారెడ్డి (9), నిర్మల్ (7), మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల వారసులకు అందజేయబడింది.

గతంలో 103 మంది గల్ఫ్ మృతుల కోసం రూ.5.15 కోట్ల ఎక్స్ గ్రేషియా విడుదల చేసినట్లు తెలిపారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో 169 మందికి రూ.8.45 కోట్లు ఎక్స్ గ్రేషియా చెల్లింపులు పూర్తి చేయబడ్డాయి అని అనిల్ ఈరవత్రి వెల్లడించారు.

 

Tags:

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..