బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్
By Ravi
On
- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టాత్మక సంస్థ ,రాజ్యాంగ సంస్ధ రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంలో 2 లక్షల ఉద్యోగాలు టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు .
- రెండు లక్షల ఉద్యోగాల భర్తీ మాట దేవుడెరుగు ..గ్రూప్ వన్ కు సంబంధించి 20 వేల పేపర్లు కూడా సరిగా దిద్దలేక పోయారు.
- రెండు నిమిషాల్లోనే పేపర్లు కొట్టేసినట్టు అనిపిస్తోంది .
- 563 గ్రూప్ వన్ పోస్టులకు ఫలితాలు ప్రకటిస్తే 500 ర్యాంకుల లోపు ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్ధి కూడా లేరు.
- కృష్ణ దేవరాయలు దేశభాష లందు తెలుగు లెస్స అంటే రేవంత్ రెడ్డి తెలుగు లెస్ అంటున్నారు .
- 40 శాతం మంది తెలుగు మీడియం అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తే అందులో పది శాతం కూడా పోస్టులు సాధించలేరా ?
- రేవంత్ రెడ్డి తెలుగు భాషను చంపేస్తున్నారు .
- తెలంగాణ తల్లిని మార్చింది ఇందుకేనా ?
- ఇదే రేవంత్ రెడ్డి వేలాది ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్లను మూసివేశారు.
- విద్యాశాఖ మంత్రి గా ఉన్న రేవంత్ రెడ్డి కి మాతృ భాష పై శ్రద్ధ లేదు .
- టీజీపీఎస్సి పరీక్షలకు తెలుగు అకాడెమీ పుస్తకాలు ప్రామాణికం కావు అంటున్నారు ..రేపు తెలుగు భాషనే ప్రామాణికం కాదంటరేమో
- కేవలం రెండు పరీక్షా కేంద్రాల్లోనే 74 మంది గ్రూప్ వన్ టాపర్లు ఉన్నారు .
- కేవలం 15 సెంటర్లోనే మొత్తం ర్యాంకులు రావడం ఏమిటీ ?
- అనేక సెంటర్లలో ఒక్కరికి కూడా రాంక్ రాలేదు .
- ఓకే మార్కులు వచ్చిన వారు ప్రత్యేకించి కొన్ని సెంటర్ల నుంచే ఉన్నారు .
- గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు .
- గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో ఒక హల్ టికెట్ నెంబర్ ,మెయిన్స్ లో ఇంకో హల్ టికెట్ నెంబర్ ఇచ్చారు .ఎక్కడా ఇలా జరగదు.
- గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ లో అనేక అవకతవకలు జరిగాయని మాకు అనుమానాలు ఉన్నాయి.
- ఈ పరీక్షల్లో థర్డ్ ఎవాల్యుయేషన్ జరగలేదు ,సెకండ్ ఎవాల్యుయేషన్ కూడా సరిగా జరగలేదు.
- ప్రొఫెసర్ల తో పేపర్లు దిద్దించాల్సింది పోయి కొందరు కాంట్ట్రాక్టు ఉద్యోగులతో దిద్దించారు.
- ఆరు గ్యారంటీల తరహాలోనే గ్రూప్ వన్ పరీక్ష ను గోల్ మాల్ చేశారు.
- నా మీద కేసు పెట్టినా ఫర్వా లేదు .గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలి.
- ఫిబ్రవరి లో గ్రూప్ వన్ ఫలితాలు వస్తాయని నవంబర్ లోనే కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్టు చేశారు.
- టీజీపీఎస్సీ చెప్పాల్సిన సమాచారం కాంగ్రెస్ పార్టీ ఎలా చెబుతోంది ?
- తొమ్మిది వేల మంది రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా మార్కులు పెరగలేదు.
- ముందే అనుకుని మ్యాచ్ ఫిక్సింగ్ తో మార్కులు వేశారు.
- టీ జీ పీ ఎస్ సి వాళ్ళు కాన్ఫిడెన్షియల్ డాటా ఇస్తున్నారా ..కాంగ్రెస్ డాటా ఇస్తున్నారా ?
- గ్రూప్ వన్ పరీక్షల మీద 30 ,నలభై కేసులున్నాయి ..ఏ రాష్ట్రం లో ఇలా కేసులు లేవు.
- కేసులన్నింటినీ తుంగలో తొక్కేసినా అని రేవంత్ రెడ్డి కోర్టులను ప్రశ్నించే విధంగా రవీంద్రభారతి లో మాట్లాడారు.
- అడిగిన వాటికి రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వడం లేదు .
- ఉస్మానియా యూనివర్సిటీ లో ఆంక్షలు పెట్టేందుకు రేవంత్ రెడ్డి అయ్య జాగీరా ?
- తెలంగాణ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి పడ్డ గడ్డ ఉస్మానియా.
- కోర్టులు మొట్టి కాయలు వేస్తున్నా రేవంత్ బుద్ది మారడం లేదు .
- హైడ్రా ,ఫ్యూచర్ సిటీ ఫిరాయింపులు ,హెచ్ సీ యూ కేసుల్లో రేవంత్ రెడ్డి కి కోర్టు చెంప పెట్టు లాంటి ఆదేశాలు ఇచ్చింది .
- గ్రూప్ వన్ పేపర్లు మొత్తం మళ్ళీ ఎవాల్యుయేషన్ చేయాలి .
- అశోక్ నగర్ లో ఆందోళనలు చేస్తున్న వారితో మాట్లాడాలి .
- ఎవరు సీఎం ను గుర్తుపట్టకున్నా అశోక్ నగర్ లో ఆందోళన చేస్తున్న వారు మాత్రం గుర్తు పడతారు .
- విద్యా శాఖ మంత్రి మారతారు అనుకుంటే రేవంత్ తానే కొనసాగుతునని చెప్పి విద్యార్థుల గుండె మీద బండ వేశారు .
- ఇప్పటికైనా గ్రూప్ వన్ లో జరిగిన లోపాలు సరిదిద్ది అభ్యర్థులకు న్యాయం చేయాలి.
Tags:
Latest News
19 Apr 2025 12:47:47
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేస్తున్నారు. వాటిల్లో సెన్సేషనల్ మాస్...