నేషనల్ కియో కరాటే ఛాంపియన్‌షిప్ సందర్భంగా TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

By Ravi
On
నేషనల్ కియో కరాటే ఛాంపియన్‌షిప్ సందర్భంగా TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

 

తెలంగాణలో క్రీడా రంగం అభివృద్ధికి, ముఖ్యంగా కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకు TPCC అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పలు ముఖ్య వ్యాఖ్యలు చేశారు.

  • "కరాటే ప్లేయర్ గా నా జీవితంలో ఇది మరిచిపోలేని రోజు" అని ఆయన పేర్కొన్నారు.

  • "మార్షల్ ఆర్ట్స్ నా జీవితంలో భాగం" అని అన్నారు.

  • "నేషనల్ కరాటే పోటీలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన సీఎం రేవంత్, మంత్రులు బృందానికి హృదయపూర్వక అభినందనలు," అని ఆయన అన్నారు.

  • "స్పోర్ట్స్ పరంగా యంగ్ డైనమిక్ సీఎం రేవంత్ నాయకత్వంలో తెలంగాణ ఎమర్జింగ్ అవుతోంది," అని మహేష్ గౌడ్ తెలిపారు.

  • "తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌గా అవతరించేందుకు సీఎం రేవంత్ ఆశయంతో కృషి చేస్తున్నారు," అని ఆయన పేర్కొన్నారు.

  • "ఆత్మ రక్షణకు.. ఆత్మ స్థైర్యం నింపే కరాటే ఎంతో అవసరం" అని మహేష్ గౌడ్ అన్నారు.

  • "కరాటే ప్రాచీన కళ. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్ననాటి నుంచే కరాటే నేర్చుకోవడం అవసరం," అని ఆయన చెప్పారు.

  • "ముఖ్యంగా బాలికలు కరాటే నేర్చుకోవాలని నా సలహా," అని TPCC అధ్యక్షుడు తెలిపారు.

  • "ఆసియా కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణకు సీఎం రేవంత్ సానుకూలంగా ఉన్నారు," అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.

  • "ప్రపంచ బాక్సర్ నిఖత్ జరిన్ నా మిత్రుడు కావడం గర్వించదగిన విషయం," అని ఆయన అన్నారు.

  • "గ్రామస్థాయిలో కరాటే నేర్చుకోవడం పట్ల అవగాహన కల్పించాలి," అని ఆయన అన్నారు.

  • "గతంలో లేని విధంగా తెలంగాణలో క్రీడలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది," అని TPCC అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్పారు.

  • "దశాబ్దాల క్రితం ఆఫ్రో-ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్.. భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదిక కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది," అని మహేష్ గౌడ్ తెలిపారు.

  • "తెలంగాణ నుంచి ప్రపంచ ఛాంపియన్లను తయారు చేయడమే మా ప్రధాన లక్ష్యం," అని ఆయన పేర్కొన్నారు.

  • "2036 ఒలంపిక్స్ దృష్టిలో పెట్టుకొని సమగ్ర క్రీడా విధానాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది," అని TPCC అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్పారు.

  • "దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండేదుకు సీఎం రేవంత్, మంత్రుల బృందం చిత్త శుద్ధితో పనిచేస్తోంది," అని ఆయన అన్నారు.

  • "హైదరాబాద్ ను 'స్పోర్ట్స్ హబ్'గా తీర్చిదిద్దడమే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది," అని మహేష్ గౌడ్ తెలిపారు.

  • "యువత చెడు వ్యసనాలకు బారినపడకుండ ఆటలను (క్రీడలను) అలవాటు చేసుకోవాలి," అని TPCC అధ్యక్షుడు అన్నారు.

  • "ఆయా క్రీడల్లో నైపుణ్యం కలిగిన విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలి," అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.

  • "యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది," అని ఆయన తెలిపారు.

  • "బడ్జెట్ లో 465 కోట్ల కేటాయింపులు క్రీడల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం," అని TPCC అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్పారు.

  • "స్పోర్ట్స్ భారీగా నిధులు తీసుకొచ్చిన శాప్ చైర్మెన్ శివసేన రెడ్డికి, కేటాయించిన సీఎం రేవంత్ గారికి అభినందనలు," అని TPCC అధ్యక్షుడు మహేష్ గౌడ్ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాప్ చైర్మెన్ శివసేన రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, నేషనల్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ భరత్ శర్మ, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!