ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

By Ravi
On
ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. నగరంలో గురువారం సాయంత్రం నుండి కురిసిన వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.గురువారం సాయంత్రం అధిక వర్షపాతం నేపథ్యంలో మేయర్ జోనల్ కమిషనర్ల తో  టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేసారు. ఇంజనీరింగ్ మరియు IRT వాహనాలు అలర్ట్ చేసి, వాటిని రంగంలోకి దింపినట్లు తెలిపారు. కూలిన చెట్లను EV&DM బృందాలు తొలగిస్తున్నాయన్నారు. శేరిలింగంపల్లి జోన్ లో రైల్వే అండర్ బ్రిడ్జి వలన ట్రాఫిక్  జామ్ ఏర్పడుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజలు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జోనల్ అధికారులను ఆదేశించారు. కూకట్ పల్లి జోన్ లో కూడా పలు లోతట్టు ప్రాంతాల్లో  నీరు నిలిచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని మేయర్ జోనల్ కమిషనర్ ను ఆదేశించగా వెంటనే సంబంధిత శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు మేయర్ కు వివరించారు. ఎల్ బి నగర్ జోన్ లో కూడా పిల్లలు వరద లో చిక్కుకుపోయినట్లు  ఫిర్యాదులు వస్తున్నాయని వెంటనే పిల్లలను కాపాడాలని మేయర్ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో  ప్రజలు అత్యవసర మైతేనే బయటికి రావాలని, రోడ్డుపై నిలిచిన నీటిలో చిన్న పిల్లలు, వృద్ధులు వెళ్లకూడదని, మ్యాన్ హోల్స్ తెరవ వద్దని మేయర్ ప్రజలను కోరారు. అత్యవసరమైతే జిహెచ్ఎంసి కాల్ సెంటర్ కు ఫోన్ చేయాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించడానికి ఇదే సరైన సమయం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో అక్కడే నీటి సంరక్షణ గుంటలను (Rainwater Harvesting Pits) ఏర్పాటు చేయాలని మేయర్ సూచించారు. 

  • ఖైరతాబాద్ జోన్:అన్ని నీరు నిలిచే ప్రాంతాలను వీడియో రికార్డ్ చేస్తున్నట్లు జోనల్ కమిషనర్ తెలిపారు. ఇదే సూచనను మిగతా జోన్లకు మేయర్ అందజేశారు.
  • కుకట్ పల్లి జోన్: రైల్వేలకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో నీటి నిలువ సమస్యలున్నాయని, అయితే రైల్వే అధికారులతో సమన్వయం చేసి సమస్యను పరిష్కరించామని జోనల్ కమిషనర్ పేర్కొన్నారు.
  • చార్మినార్ జోన్: మలక్‌పేట్ వద్ద కొంత నీరు నిలిచినప్పటికీ, ప్రస్తుతం ట్రాఫిక్ సాధారణ స్థితికి వస్తోందని తెలిపారు.
  • ఎల్బీనగర్ జోన్:చంపాపేట్, సరూర్ నగర్ వద్ద సహజసిద్ధమైన భూస్థితి వల్ల కొంత నీటి నిల్వ ఏర్పడిందని, అయితే కొద్దిసేపటి తరువాత అది తగ్గిపోతుందని వివరించారు.

రక్షణ చర్యలు:

మూసీ నది వద్ద ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోవడంతో, DRF బృందం రక్షణ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి, త్వరలో పూర్తి స్థాయిలో పరిష్కారం అందించబడుతుందని అధికారులు తెలిపారు.

Tags:

Advertisement

Latest News

విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్? విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్?
ప్రజంట్ మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి...
కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న యాక్టర్ సుహాస్..
ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!