జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి - కలెక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు కలెక్టర్ సత్య శారద విజ్ఞప్తి

By Ravi
On
జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి -  కలెక్టర్ సత్య శారద

వరంగల్:

తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకొని  ఏప్రిల్ 11న  వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు టాస్క్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళా  సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్య శారద సూచించారు. జాబ్ మేళాకు సంబంధించిన సన్నాహాక సమావేశం గురువారం వరంగల్ లోని ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలు కంపెనీల ప్రతినిధులు, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు... డిఆర్డిఓ జిఎం, జడ్పీ సీఈవో,  గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రామేశ్వర్, మెప్మా ప్రతినిధులు సుమారు 200 మంది వరకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా యువతీ యువకులందరూ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని, తమ  పేరును నమోదు చేసుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరారు.నిర్వాహకులు విడుదల చేసిన పోస్టర్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు ఎన్ రోల్ చేసుకోని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 9:30 గంటల నుండి ప్రారంభం అవుతుందని కలెక్టర్  గుర్తు చేశారు.WhatsApp Image 2025-04-03 at 8.31.03 PM

Tags:

Advertisement

Latest News