విద్యార్థుల కోసం లక్ష్య సాధనపై జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

By Ravi
On
విద్యార్థుల కోసం లక్ష్య సాధనపై జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

WhatsApp Image 2025-03-27 at 7.11.56 PM

నల్గొండ: జిల్లా కలెక్టర్ లీలా త్రిపాఠి గురువారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ లోని నిడమనూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తనిఖీ సందర్భంగా, జిల్లా కలెక్టర్ విద్యార్థుల తెలివితేటలు పరీక్షించారు. గణితం, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులపై విద్యార్థులకు వివిధ ప్రశ్నలు అడిగి, సరైన సమాధానాలు ఇచ్చిన వారికి చాక్లెట్లు పంపిణీ చేశారు.

తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్, ఎండాకాలంలో విద్యార్థులు అనారోగ్యం పాలు కాకుండా, జంక్ ఫుడ్ తినకుండా సులభంగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలని సూచించారు.

పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, వారు తక్కిన పరీక్షలను బాగా రాయాలని, వారి అగ్రహానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

మరియు, విద్యార్థులకి ఒక ముఖ్యమైన సూచన ఇచ్చారు. ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుండే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ లక్ష్య సాధన కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చెప్పారు.

Tags:

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..