117 జీవో రద్దు – విద్యా విధానంలో 4 విధాలుగా మార్పులు: ఎమ్మెల్యే గొండు శంకర్

By Ravi
On
 117 జీవో రద్దు – విద్యా విధానంలో 4 విధాలుగా మార్పులు: ఎమ్మెల్యే గొండు శంకర్

శ్రీకాకుళం: విద్యా వ్యవస్థ బలోపేతం కోసం, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 117 జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేసినట్లు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన గార మండలంలోని ఎండిఓ ఆఫీస్ లో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, "117 జీవో రద్దు చేసి, ప్రస్తుత ప్రభుత్వం విద్యా విధానాన్ని బలోపేతం చేయడానికి నాలుగు విధాలుగా అమలు చేయనున్నది" అని చెప్పారు. ఆయన వివరించగా, విద్యా విధానం నాలుగు భాగాలలో అమలు చేయబడుతుంది:

  1. ఫౌండేషన్ కోర్సు

  2. బేసిక్ ప్రైమరీ

  3. మోడల్ ప్రైమరీ

  4. హై స్కూల్ విద్యా విధానం

ఈ విధానాలను అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. పాఠశాలల్లో విద్యాబోధనలో మార్పు, విద్యా విధానంలో అంచనాలను బట్టి మంచి విజయం సాధించవచ్చని అన్నారు.

"గతంలో 117 జీవో ద్వారా విద్యా విధానంలో జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకొని, ఈ జీవోను రద్దు చేసేందుకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది" అని ఎమ్మెల్యే గోవిందరావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి, విద్యా కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..