ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్.

By Ravi
On
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్.

ఆర్థోపెడిక్ విభాగంలో పేషెంట్స్ తో మాట్లాడిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్.

TPN RAJASEKHAR SRIKAKULAM 
Date 04/03/25

ఆసుపత్రిలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అయ్యా యని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శుక్రవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆయన సందర్శించి సమీక్షించారు. సందర్శన అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఆసుపత్రి పై చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయని, సమస్యలు పరిశీలనకు సందర్శించగా ఆ సమస్యలు ప్రస్తుతం పరిష్కారం అయినట్లు చెప్పారు. కొన్ని మందులు అందుబాటులో లేవని ఫిర్యాదు లు రాగా మందులు అన్ని అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ఖాళీలు ఉండగా తన పరిధిలో ఉన్న వాటిని వారం రోజుల్లో ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. జిల్లాలో జిజిహెచ్ పెద్ద ఆసుపత్రి కావున వైద్యం నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వస్తుంటారని చెప్పారు. వైద్యం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చిన టెక్కలి ప్రాంతానికి చెందిన పోలా భాస్కరరావు అనే వ్యక్తిని ఎంతు నిమిత్తం వచ్చారని కలెక్టర్ అడుగగా ఊరిలో పడిపోయానని, టెక్కలి హాస్పిటల్ నుండి శ్రీకా కుళం ప్రభుత్వ ఆసుపత్రి వచ్చి నట్లు చెప్పారు. వచ్చిన తర్వాత ఇక్కడే రెండు శస్త్రచి కిత్సలు చేసినట్లు కలెక్టర్ కు వివరిం చారు. శస్త్ర చికిత్సలు బా గా చేశారా లేదా అని పేషెంట్ ను అడుగగా బాగా చేసి చూసు కున్నట్లు తెలిపారు. మందులు యిస్తున్నది లేనిది ఆయన అడు గగా మందులు ఇస్తున్నట్లు పేర్కొ న్నారు. ఎముకల విభాన్ని సందర్శించి పేషెంట్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థో పెడిక్ విభాగంలోని పేషెంట్స్ తో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యం నింపారు. మరుగుదొడ్లు పరిశీలి ంచి పలు సూచనలు జారీ చేశారు. రన్నింగ్ వాటర్ వస్తు న్నది లేనిది పరిశీలించారు. కాంట్రాక్టు బేసిస్ సిబ్బంది గూర్చి ఆరా తీశారు. శానిటేషన్ డిస్ప్లే " యస్ ఆర్ఎంఓ బాను ప్రకాష్ ను కలెక్టర్ అడుగగా సిబ్బంది చేస్తున్న పనులను వివరించగా సిబ్బంది అంతా సమయానికి వస్తున్నది లేనిది అడిగి తెలుసు కున్నారు. ఓపి రిజిస్ట్రేషన్ ను సందర్శించి ఒక ఓపికి ఎంత సమయం పడుతుందని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Tags:

Advertisement

Latest News

అక్రమ ఔషధాలు సీజ్‌..! అక్రమ ఔషధాలు సీజ్‌..!
అక్రమంగా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలిమెల మండలంలో సోదాలు చేశారు....
వ్యక్తిపై బండరాయితో దాడి..!
సిటీలో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టు..!
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌..!
11 ఏళ్ల బాలికపై వృద్ధుడు లైంగికదాడి..!
వంశధార ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలి..!
శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం..!