ముందు సాక్షి క్లోజ్.. ఆ వెంటనే జగన్

By Ravi
On
ముందు సాక్షి క్లోజ్.. ఆ వెంటనే జగన్

సిద్ధమైన రంగం.. సరైన సమయం కోసం వెయిటింగ్
ఒకవైపు రెడ్ బుక్ అంటూ లోకేష్... ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ వాదులాడుకుంటూనే ఉన్నారు. మరోవైపు ఇంత మెజారిటీతో ప్రభుత్వం వచ్చినా ఇంకా వైసీపీ నేతలపై మీనమేషాలేంటంటూ మొన్నటివరకు టీడీపీ, జనసేన కేడర్ మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే ఆ కథ మొదలైపోయిందని అర్ధమవుతోంది. పేర్నినాని, జోగి రమేష్ లపై చిన్న చిన్న కేసులతో మొదలైన ఆ కథ ఇప్పుడు వల్లభనేని వంశీతో హీటెక్కింది. పోసాని సంగతి సరేసరి. మొన్నే అసెంబ్లీలో రోజా అవినీతిపై చర్చ, ఇప్పుడు లేటెస్టుగా విడదల రజనీపై ఏసీబీ కేసు కూడా ఈ కథ స్పీడెక్కిందని అర్ధమయ్యేలా చేస్తోంది. అధికారంలోకి వచ్చిన 9 నెలల దాకా వేచి చూసిన కూటమి సర్కార్.. ఇక వ్యూహాత్మకంగా ఒక్కో బోల్టు బిగిస్తుందని తెలుస్తోంది. ముందు చిన్న చిన్న స్ర్కూలు బిగించిన కూటమి సర్కార్.. ఇప్పుడు నట్లు, బోల్టులు బిగిస్తోంది. ఇక త్వరలోనే అసలు కేండెట్ ని బిగించేస్తారని ప్రచారం మొదలైంది. 
ఇప్పటికే పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..’’ జగన్ ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో వాంగ్మూలం దానికి తగ్గట్టుగా తీసుకున్నారంట. అయినా మేమేమీ భయపడం’’ అంటూ మాట్లాడారు. ఎస్.. నిజమే లిక్కర్ స్కామ్ కేసులో జగన్ అరెస్టుకు రంగం సిద్ధం చేసేశారు. అలాగే కాకినాడ సెజ్ కేసులోనూ ఆయన పేరు ఎక్కబోతుందంట. పైగా ఈ రెండు కేసుల్లో అధికారులకు పనికొచ్చే తురుపుముక్క విజయసాయిరెడ్డి అని అంటున్నారు. 
అయితే దీని కంటే ముందు సాక్షి పత్రిక, చానెల్ ను మూయించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కోర్టు ఆర్డర్ల మీద మాత్రమే అవి నడుస్తున్నాయి. ఆ స్టే ఆర్డర్లు వెకేట్ చేస్తే .. క్లోజింగే. ప్రస్తుతం ఆ పనిలోనే కూటమి పెద్దలున్నారని సమాచారం. కేంద్రంలో పెద్దమనిషి అమిత్ షా కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది. అది ఎగ్జిక్యూట్ అయితే ఇక సాక్షి ప్రసారాలు, ప్రచురణ ఆగిపోతాయి. ఆ తర్వాత వెంటనే జగన్ అరెస్ట్ కార్యక్రమం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్ సభలో లిక్కర్ స్కామ్ గురించి మెన్షన్ చేసి.. ఈడీ విచారించాలని డిమాండ్ చేశారు. అలాగే హోంమంత్రి అమిత్ షా ను కలిసి మొత్తం తన నివేదిక అందించారు. ఇవన్నీ చూస్తుంటే వైసీపీ అనుమానాలు నిజమయ్యేలాగానే అనిపిస్తోంది. ఈడీ ఇప్పటికే కాకినాడ సెజ్ కేసులో ఎంటరైంది. అలాగే ఇందులోనూ వచ్చి.. జగన్ పేరు ఎఫ్ఐఆర్ లోకి ఎక్కితే మాత్రం.. ముందు ఉన్న బెయిల్ రద్దయ్యే అవకాశం చాలా ఎక్కువ. 
గతంలో జైలుకెళ్లినా జగన్ కు సానుభూతి వచ్చింది. ఈసారి అలా రాకూడదనేదే కూటమి వ్యూహమంటున్నారు. ముందు వైసీపీ చేసిన తప్పులను ఒక్కో కేసు ద్వారా ప్రజల ముందుకు తెస్తూ తర్వాత సాక్షి, ఆ తర్వాత జగన్ జోలికి వెళ్లాలనేదే వ్యూహమంట.  జరగాల్సిన చర్చ అంతా జరిగాకే ఎగ్జిక్యూషన్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈసారి జగన్ కు ఎలాంటి సానుభూతి రాకూడదనేదే ఆ వ్యూహం లక్ష్యం. మరి కూటమి లక్ష్యం నెరవేరుతుందా.. మళ్లీ ఏపీ ప్రజలు సానుభూతి చూపిస్తారా? వేచి చూడాల్సిందే.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..