చంద్రబాబు ముస్లింల ద్రోహి...

By Ravi
On
చంద్రబాబు ముస్లింల ద్రోహి...

వక్ఫ్ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం షేక్ అలీఖాన్ బాబా

MAHESH, MANDAPETA, TPN

వక్ఫ్  బోర్డు చట్టానికి మద్దతు పలికిన టిడిపి అధినేత చంద్రబాబు చరిత్రలో ముస్లిం ద్రోహి గా నిలిచిపోతారని షేక్ అండ్ షేక్  కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా విమర్శించారు. గురువారం మండపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు. లోక్ సభ లో వక్ఫ్ బిల్లు ఆమోదంపై నిరసన తెలిపారు. వక్ఫ్ బోర్డులో ఇతరులకు అవకాశం ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా  చంద్ర బాబు ముస్లిం ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. టిడిపిలోని మైనార్టీలు పునరాలోచించు కోవాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే వారిని ముస్లింలు వెలివేస్తారని హెచ్చరించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద  ముస్లింల కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీలకు పెద్దపీట వేశారని కొనియాడారు. మైనార్టీల సంక్షేమానికి రు 26 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత జగన్ దే అని పేర్కొన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జగన్ ముస్లిం ల కోసం తీసుకొచ్చారని పేర్కొన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ లో  సవరణ బిల్లులు తమ పార్టీ వ్యతిరేకించిందన్నారు.  కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 ,25 ,26  స్ఫూర్తికి వక్ఫ్ సవరణ బిల్లు తూట్లు పడుతుందన్నారు. ప్రజాస్వామ్య సెక్యులర్ దేశంలో ముస్లింలను ద్వితీయ పౌరులు స్థాయికి దిగజార్చేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తుందని విమర్శించారు .1954 నుంచి అమలులోకి వచ్చిన వక్ఫ్ చట్టానికి గతంలో జరిగిన సవరణలకు నేటి సవరణలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. గత ప్రభుత్వాలు ముస్లిం మత పెద్దలతో చర్చించాకే సవరణలు చేసిన సంఘటనలు గుర్తు చేశారు. మసీదులు దర్గాలు ఆశురాఖనాలు స్మశానాల నిర్వహణ కోసం ముస్లిం లు భూమిలను దానంగా ఇచ్చారని తెలిపారు. అవి అల్లాకు సంబంధించిన ఆస్తులుగా తాము భావిస్తామన్నారు. నేటి ఎన్డీఏ ప్రభుత్వం దాని అర్ధాన్ని మార్చేస్తుందన్నారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఆధార పత్రాలు చూపమంటే ఎవరు చూపగలరని ప్రశ్నించారు. ఎవరు  వక్ఫ్  చేయాలన్న వారు ఐదేళ్లు ముస్లిం గా ప్రాక్టీస్ చేసి ఉండాలని ఇందుకు సంబంధించిన డిక్లరేషన్ కోరడం ఏమిటనీ ఆయన మండిపడ్డారు. ముస్లింలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు తగిన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతాయని హెచ్చరించారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!