నన్నయ్య యూనివర్సిటీలో కీచక అధ్యాపకులు
() తెలుగు పాఠాలలో సెక్స్ పాఠాల జోడింపు
() రాత్రంతా మాతో గడిపితే బిర్యానీ మందు ఫ్రీ
() వస్తే వందకు వంద మార్కులు.. లేదంటే ఫెయిల్
() ఎస్సీ విద్యార్ధినిలను లైంగికంగా వేధించడమే ప్రవృత్తి
() ఫిర్యాదు చేసినా పట్టించుకోని మహిళా వైస్ ఛాన్సలర్
KS Shekar, SPL Correspondent, East Godavari, TPN : స్పర్ధయా... వర్ధతే విద్యా అన్నారు. ఈ నినాదంతో ప్రారంభమైనదే రాజమహేంద్రవరంలోని అదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం. 2006 ప్రారంభమైన ఈ విశ్వ విద్యాలయంలో మొదటి నుండే పలు కళాశాలల పి.జి., పి.హెచ్.డి. దీని పరిధి లోనే నడిచేవి. 2011 నుండి తూర్పు, పశ్చిమ గోదావరి డిగ్రీ కళాశాలలన్నీ అనుబంధ కళాశాలలుగా మారాయి. విద్యార్ధినీ విద్యార్దులకు ప్రత్యేక హాస్టల్ వసతి కూడా మొదటి నుంచే ఏర్పాటు చేశారు. ఇంతటి గొప్ప ఖ్యాతి గడించిన యూనివర్సిటీని... ఇద్దరు అధ్యాపకులు తమ వికృత చేష్టలతో... గబ్బు పట్టిస్తున్నారు. ఏళ్ల తరబడి వీరి ఆకృత్యాలు కొనసాగుతున్నా... బయటకు వచ్చి ఫిర్యాదు చేసే థైర్యం చాలక... ఎంతో మంది విద్యార్ధినిలు తమ చదువులను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. తెలుగు పాఠాలు బోధించాల్సిన అధ్యాపకుడు... వికృత చేష్టలతో... కామ పాఠాలు చెబుతున్నాడట. రాజ్యాంగం గురించి.. ప్రజాస్వామ్య పాలన గురించి చెప్పాల్సిన పొలిటికల్ అధ్యాపకుడు... రాత్రికి తన గదికి వస్తే... అన్నీ నేర్పుతానంటున్నాడట. వీళ్ల అరాచకాలను భరించలేక ఎట్టకేలకు కొందరు విద్యార్ధినులు బయటకొచ్చారు. వీసీకి ఫిర్యాదు చేశారు. కానీ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేసే ప్రయత్నాలన్నీ జరుగుతన్నాయి. కొత్తగా వచ్చిన మహిళా వీసీ సైతం... ఈ అధ్యాపకులపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో.... ఆ ఇద్దరు కీచక అధ్యాపకులు కొత్త ఎత్తులతో... విషయం పక్కదారి పట్టించే ప్రయత్నం మొదలుపెట్టారు.
అసలేం జరిగింది..? ఎవరా కీచక అధ్యాపకులు
..............................................................................................
నన్నయ్య యూనివర్సిటీలో కీచక అవతారం ఎత్తిన ఇద్దరు అధ్యాపకుల్లో ఒకరు... డాక్టర్.T.S.N అంటే ఇతని పూర్తిపేరు తరపట్ల సత్యనారాయణ. తెలుగు డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇక రెండో కీచక అధ్యాపకుడు డాక్టర్ ఎన్. రాజశేఖర్... అసిస్టెంట్ ప్రొఫెసర్... పొలిటికల్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. వీరిద్దరీ ప్రత్యేకత ఏంటి అంటే... ఏం చేసినా ఇద్దరూ కలిసే చేస్తారు. అమ్మాయిలను లొంగ దీసుకోవడం దగ్గర నుంచి... వారిని భ్రమల్లోకి దించి... రూమ్ తీసుకు వచ్చే వరకూ... ఇద్దరూ ఒకరినొకరు ఎంతగానో సహాయపడతారు. ఏం చేసినా ఇద్దరూ కలిసే చేయాలనుకుంటారు. రాయడానికి వీలులేనంతగా.. వీరి అరాచకం సాగుతోందట. పైగా ఎస్సీ విద్యార్ధినిలనే... టార్గెట్ చేయడం వీరి లక్ష్యం. వీరు ఎంచుకున్న అమ్మాయిలకు... మంచి మార్కులు వేసి... వారిని లొంగదీసుకుటారు. మాకు సహకరిస్తే... అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వేయిస్తామని నమ్మబలుకుతారట. అంతేకాదు... ఏ రాత్రి తమ దగ్గరకు వచ్చినా... మందు. బిర్యానీలతో ఫుల్ గా ఎంజాయ్ చేసేలా ఎర్పాట్లు చేస్తామని ఆఫర్ కూడా ఇస్తారట. ఇలానే కొందరు విద్యార్ధినిలు వీరి బారిన పడి.. బయటకు చెప్పుకోలేక నరకయాతన అనుభవించారని తెలుస్తోంది. అయితే వీరి అరాచకాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఎట్టకేలకు ఓ విద్యార్ధిని... వీసీకి ఫిర్యాదు చేసింది. ఎంతైనా కొత్తగా వచ్చిన మహిళా వీసీకి కదా తనకు న్యాయం జరుగుతుందని భావించింది. కానీ ఆ అమ్మాయికి న్యాయం జరగకపోగా... యూనివర్సిటీ నుంచి చదువు మానేసి ఇంటికి వెళ్లిపోయిన పరిస్థితి దాపురించింది.
వీసీ ప్రసన్న శ్రీ ఎందుకు మెత్తబడ్డారు..?
................................................................................
కీచక అధ్యాపకులపై మహిళా వైస్ ఛాన్సలర్ ప్రసన్నశ్రీకి.. సదరు బాధిత విద్యార్ధిని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. జరిగిన కథ అంతా వివరంగా చెప్పింది. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించిందట. వీసీ ప్రసన్న శ్రీ కూడా... ముందు విద్యార్ధినులకు అనుకూలంగా స్పందించినా... తర్వాత మెత్తబడినట్లు సమాచారం. అంతేకాదు... కీచక అధ్యాపకుడు తరపట్ల సత్యనారాయణకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒక విద్యార్ధిని బయటకు వచ్చి... తనను ఇద్దరు ఆచార్యవర్యులు... గదిలోకి రమ్మని పిలిచారని సిగ్గు విడిచి చెప్పినా... వీసీ ఎందుకు స్పందించ లేదు అనేదే ఇక్కడ అతి పెద్ద ప్రశ్న. యూనివర్సిటీ పరువు పోతుందనే ఉద్దేశ్యంతో... విషయాన్ని దాచిపెట్టినా... తన పదవికి ఆటంకం కలుగుతుందేమో అని ఆలోచించినా... ఆ ఇద్దరు అధ్యాపకులను కాపాడినట్టే అవుతుంది. ఒక కాలేజీలోనో... స్కూల్ లోనో... లైంగిక వేధింపులు జరిగితేనే తక్షణ చర్యలు తీసుకుంటున్న తరుణంలో... ఏకంగా విశ్వ విద్యాలయంలోనే.. ఏళ్ల తరబడి.. ఇద్దరు అధ్యాపకులు... తమ కామ క్రీడలను కొనసాగిస్తున్నారనే విషయం వెలుగులోకి వస్తే చర్యలు ఏవిధంగా ఉండాలి..? వెంటనే ఒక కమిటీ వేసి విచారణ జరపాలి. ఆ ఇద్దరు అధ్యాపకుల్ని తొలగించాలి. కానీ మహిళా వీసీ ప్రసన్నశ్రీ... నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడమే గమనార్హం.
తూతూ మంత్రంగా ఉమెన్ సెల్
................................................................
విద్యార్ధినిలుపై కీచక అధ్యాపకుల లైంగిక వేధింపులపై వీసీ ప్రసన్న శ్రీ... ఈ వ్యవహారాన్ని ఉమెన్ సెల్ కి అప్పగించారు. మార్చి 19వ తేదీ 2025న ఫిర్యాదు చేస్తే.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు. పైగా ఉమెన్ సెల్ విచారణ అంతా ఏకపక్షంగానే చేశారు తప్ప.. సదరు బాధితురాలు వివరణ ఇచ్చినా.. దానిని పరిగణలోకి తీసుకోలేనట్లు సమాచారం. అంతేకాదు కేసును పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నంలో సదరు కీచక అధ్యాపకులు నిమగ్నమైపోయారట. వీరికి యూనివర్సిటీ అధికారులతో పాటు.. రెసిడెంట్ అడ్వకేట్ కూడా సహాయం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఫిర్యాదు ఎవరు చేశారనే విషయం మాత్రం వీసీ గోప్యంగా ఉంచారు. దీంతో... ఇద్దరు అధ్యాపకులు... కొందరు విద్యార్ధినులను భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఎవరు ఫిర్యాదు చేశారో తెలిస్తే... వారిని యూనివర్సిటీ నుంచి వెళ్లగొడతామంటూ బెదిరిస్తున్నారట. అయితే ఈ వ్యవహారం మొత్తం... విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా... సదరు విద్యార్ధినులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా వీసీ ప్రసన్న శ్రీ... చర్యలు తీసుకుంటారా...? లేక యూనివర్సిటీలో జరుగుతున్న లైంగిక వేధింపుల వ్యవహారంపై నేరుగా మంత్రి నారా లోకేశ్ రంగంలోకి దిగుతారో వేచి చూడాలి.