బూతులతో రెచ్చిపోయిన పికిల్స్ యజమాని అలేఖ్య.. క్లారిటీ ఇచ్చిన చెల్లి రమ్య

By Ravi
On
బూతులతో రెచ్చిపోయిన పికిల్స్ యజమాని అలేఖ్య.. క్లారిటీ ఇచ్చిన చెల్లి రమ్య

కస్టమర్ పై బూతులతో రెచ్చిపోయింది పికిల్స్ యజమాని అలేఖ్య. వాట్సాప్ లో బూతులు తిడుతూ మెసేజ్ లు పంపింది. ఇవి కాస్త వైరల్ కావడంతో సోషల్ మీడియా అంతా హీటెక్కిపోయింది. కాస్ట్ ఎక్కువని అడిగితే బూతులు తిడతారా అని ఆమెపై భగ్గుమంటున్నారు నెటిజన్లు.

దీంతో తాజాగా అలేఖ్య చెల్లి రమ్య గోపాల్ కంచెర్ల ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది. ఆ బూతులు తిట్టడం వెనుక కారణమేంటి? అసలు జరిగిందేంటి? అనే దానిపై వివరణ ఇస్తూ వీడియో రిలీజ్ చేసింది.వివాదంపై అలేఖ్య చెల్లి రమ్య మాట్లాడుతూ.. ''పికిల్స్ వెబ్ సైట్ లో మేము రోజూ వందల మెసేజ్ లు మేనేజ్ చేస్తాము. వాటిలో చాలా వరకు బూతు మెసేజ్ లే వస్తుంటాయి. కొన్నింటిని బ్లాక్ చేస్తాము.. కానీ కొన్నింటికి ఫ్రస్ట్రేషన్లో రిప్లై పెడతాం. అలా ఈ ఇష్యూలో తప్పుగా మెసేజ్ చేసిన వేరే వ్యక్తిని తిట్టబోయి.. మా అక్క మరో వ్యక్తిని తిట్టింది. ఆ తర్వాత వెంటనే రియలైజ్ అయ్యాక మెసేజ్ డిలీట్ చేసింది. కానీ అప్పటికే ఆయన దానిని చూడడంతో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో పెద్ద ఇష్యుగా మారిందని'' క్లారిటీ ఇచ్చింది. తప్పుగా మాట్లాడిన వారికి తాము కూడా అదే విధంగా రిప్లై ఇస్తామని, ఇన్నోసెంట్ కస్టమర్స్ తో తాము ఎప్పుడూ అలా ప్రవర్తించమని వివరణ ఇచ్చింది. అలాగే పొరపాటున తిట్టిన అతడికి క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిపింది అలేఖ్య చెల్లి రమ్య.

Tags:

Advertisement

Latest News

అక్రమ ఔషధాలు సీజ్‌..! అక్రమ ఔషధాలు సీజ్‌..!
అక్రమంగా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలిమెల మండలంలో సోదాలు చేశారు....
వ్యక్తిపై బండరాయితో దాడి..!
సిటీలో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టు..!
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌..!
11 ఏళ్ల బాలికపై వృద్ధుడు లైంగికదాడి..!
వంశధార ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలి..!
శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం..!