మీర్పేట్ కార్పొరేషన్ ను జిహెచ్ఎంసిలో విలీనం:50% ప్రపార్టీ ట్యాక్స్ తగ్గింపు
హైదరాబాద్, 25 మార్చి 2025:
టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామీడి గోపాల్ రెడ్డి మరియు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కేఎల్ఆర్ ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ ను జిహెచ్ఎంసి (హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్) లో విలీనం చేయడం, మరియు 50% వరకు ప్రాపర్టీ టాక్స్ తగ్గించడానికి తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ నిర్ణయాన్ని మహేశ్వరం నియోజకవర్గంలోని కేఎల్ఆర్ క్యాంప్ ఆఫీస్ లో వారు ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల పై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు సహాయంతో ఈ నిర్ణయం అమలు చేస్తున్నారని తెలిపారు.
సామీడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, "డబ్బున్నవారిపై టాక్స్ పెంచడం అనేది ఆమోదయోగ్యమే, కానీ రెక్కాడితేగా నొక్కాడని పరిస్థితుల్లో జీవిస్తున్నవారికి పెద్ద భారం పడకుండా వారి పక్షంలో నిలబడాలని మా ప్రభుత్వ లక్ష్యం."
ఈ చర్యతో ప్రాపర్టీ టాక్స్ లో మార్పులు తీసుకుని, బలహీన వర్గాల మన్నించడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వారు చెప్పారు.