శ్రీరామ నవమి శోభాయాత్ర పై సిటీ పోలీసుల సమీక్ష సమావేశం
హైద్రాబాద్, సీతారాం బాగ్ లోని ద్రౌపతి గార్డెన్ లో శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహకులతో సమీక్షసమావేశం నిర్వహించిన పోలీసు కమిస్నర్ సివి.ఆనంద్,పాల్గొన్న జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు,ట్రాఫిక్ పోలీసు అధికారులు, ఎలక్ట్రిక్ ఉన్నతాధికారులు తదితరులు
శోభాయాత్ర మార్గదర్శకాలపై ట్రాఫిక్ సిబ్బందికి,పోలీసు ఉన్నతాధికారులకు,శోభాయాత్ర నిర్వాహకులకు సూచనలు కల్పించిన.. సిపి సివి ఆనంద్
నిర్వహకులతో కలసి సీతారాం బాగ్ నుండి బోయిగూడా,దుల్పెట్,పురాణాపుల్,జుమ్మరాత్ బజార్,చెత్రి, గోల్ మజీద్, గౌలిగూడా,కోఠి,సుల్తానుబజార్ ప్రాంతాల మీదుగా రూట్ మార్గాలను పర్యవేక్షించిన...సివి ఆనంద్
*డిజి&నగర సిపి సివి ఆనంద్*
శ్రీరామ నవమి కోఆర్డినేటర్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు
మనం అందరం కలిసి శ్రీరామ నవమి శోభాయాత్ర లో ఆనందంగా పాల్గొనాలి
ప్రతిసంవస్తారం నుండి కొనసాగే శ్రీరామ శోభాయాత్ర లో తగినన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము
శోభాయాత్ర లో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి
శోభాయాత్ర ప్యారంభం అనుకున్న సమయానికి ప్రారంభించాలని నిర్వాహకులను కోరుతున్నాము
ఉదయం 1గంటలకు ప్రారంభం అయ్యే శోభాయాత్ర 2,3గంటలకు ప్రారంభం ఐతుంది కాబట్టి నిర్వాహకులు దృష్టి సారించాలి
సమయానికి శోభాయాత్ర నిర్వహించాలి,లేనిపక్షంలో అనేక సమష్యాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని గమనించాలి
దాదాపు 20వేల మంది పోలీసులతో,సీసీ కెమెరాల పర్యవేక్షణ లో భద్రత ఏర్పాటు చేశాము
దొంగతనాలకు పాల్పడకుండా,మహిళలను ఈవ్ టీజ్ చేయకుండా,మఫ్తి పోలీసులు,షీటమ్ బృందాల నిఘాతో పర్యవేక్షణ చేస్తాము
సీతారాం బాగ్ నుండి అనుమాన్ వ్యాయమ శాల వరకు 6.2కిలోమీటర్లు శోభాయాత్ర ఉంటుంది
వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నాము
శోభయాత్రలో టస్కార్ మార్గం మధ్యలో ఎక్కడ ఇరుకోకుండా,విగ్రహాలు పెద్దవి తేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
బందోబస్తు లో భాగంగా పోలీసులు డ్రోన్ల పరివేక్షణలో శోభాయాత్ర పరివేక్షణ చేస్తాము
నిర్వాహకులు డ్రోన్ కెమెరాలు ఉపయోగించాలంటే పోలీసుల పరిమిషన్ తీసుకోవాలని కోరుతున్న
డిజె సౌండ్ లతో చాలామంది నుండి ఫిర్యాదులు వస్తున్నాయి..బాక్స్ లు పెట్టుకొని శోభాయాత్ర నిర్వహిస్తే మంచిది
శ్రీరాముని గూర్చి ఎంతైనా మాట్లాడొచ్చు...కానీ ఇతర మతాలను కించపరిచేలా ప్రసంగాలు చేయొద్దని కోరుతున్న
శోభాయాత్ర లో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి
శోభాయాత్ర నిర్వాహకులు,పోలీసులు సంయమనం తో యాత్ర జేయప్రదం చేయాలని,ప్రజలకు ఎవ్వరు ఇబ్బందులు కల్పించొద్దని కోరుతున్న