ఏప్రిల్ 1వ తారీఖు నుండి మున్సిపల్ కార్యాలయం టిడ్కో అపార్ట్‌మెంట్స్ కు మార్పు

By Ravi
On
ఏప్రిల్ 1వ తారీఖు నుండి మున్సిపల్ కార్యాలయం టిడ్కో అపార్ట్‌మెంట్స్ కు మార్పు

 

మండపేట:
ఏప్రిల్ 1వ తేదీ నుండి, మున్సిపల్ కార్యాలయం టిడ్కో అపార్ట్‌మెంట్స్ కు మార్చబడిందని, ప్రజలు అందరూ ఈ మార్పును గమనించాలని మున్సిపల్ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు.

6128 టిడ్కో అపార్ట్‌మెంట్స్ ను గొల్లపుంత కాలనీ, మండపేట పట్టణం లో నిర్మించారు. అందులో 2565 మందికి ప్లాట్లు అప్పగించామని, మిగిలిన 3563 మందికి ప్లాట్లు అప్పగించాల్సి ఉందని తెలిపారు. అయితే, ఈ పనులు 95 శాతం పూర్తయ్యాయి. ఇంకా మిగిలిన పనులు పూర్తి చేసి, లబ్దిదారులకు ప్లాట్లు అప్పగించాల్సిన పని ఉన్నప్పటికీ, టిడ్కో మరియు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే వేగుళ్ళ అన్నారు.

ఈ నేపధ్యంలో, మిగిలిన పనులు పూర్తి చేసి లబ్దిదారులకు ప్లాట్లు అప్పగించేంతవరకూ, మున్సిపల్ కార్యాలయాన్ని టిడ్కో అపార్ట్‌మెంట్స్ వద్దకు మార్చాలని ఎమ్మెల్యే మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు.

ఇప్పుడని, ఏప్రిల్ 1వ తేదీ నుండి, మున్సిపల్ సేవలు కొరకు టిడ్కో అపార్ట్‌మెంట్స్ లో ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్యాలయం లో సంప్రదించాలని ప్రజలకు సూచన ఇచ్చారు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..