వట్రపూడి పి ఏ సి ఎస్ లో జనరల్ బాడీ సమావేశం
తూతూ మంత్రంగా మారిన సమావేశం
కె గంగవరం మండల పరిధిలోని వట్రపూడి పి ఏ సి ఎస్ లో ఈరోజు నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం అనేది తూతూ మంత్రం గానే నిలిచింది. ఈ పి ఏ సి ఎస్ లో 600 మంది సభ్యులు ఉన్నప్పటికీ, చైర్మన్ ఎన్. దుర్గా సాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పట్టుమని పది మంది కూడా హాజరు కాలేదు.
2024 సెప్టెంబర్ 1వ తేదీ నుండి 2025 ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆదాయం మరియు ఖర్చులను చదివి సభ్యులను మమ (మనసుకు నచ్చినట్లుగా) అనిపించారు.
సభ్యులు హాజరు గురించి వివరణ కోరినప్పుడు, 600 మంది సభ్యుల్లో 60 మంది హాజరు ఉంటే సమావేశం నిర్వహించడానికి సరిపోతుందని, మిగతా వారు ఎప్పుడైనా పుస్తకంలో సంతకం పెట్టడానికి వచ్చి హాజరైనట్లుగా చూపించవచ్చు అని చైర్మన్ దుర్గా సాగర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా మారింది.
ఈ సమావేశంలో ఎరువు బస్తాలు పంపిణీ పై కూడా చర్చ జరిగింది. స్థానిక రైతులకు కాకుండా బయటి గ్రామాలకు మరియు దుకాణాలకు ఎరువు బస్తాలు అమ్ముతున్నారని, దూడల నాగేశ్వరరావు సభ్యులు దీనిపై ఇంక్వైరీ జరిపి స్థానిక రైతులకు న్యాయం చేయాలని కోరారు.