విద్యార్థుల ప్రతిభను గుర్తించి స్కాలర్‌షిప్‌ల పంపిణీ చేసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
By Ravi
On
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, మలబార్ గోల్డ్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీకాకుళం పట్టణంలోని నాగావళి హోటల్లో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించడం గొప్ప విషయం. ట్రస్టులు సేవా కార్యక్రమాలు మాత్రమే కాదు, విద్యార్థులకు సహాయం చేసి వారి భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిద్దడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి" అని అన్నారు.
ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయడం, వారికి విద్యాభ్యాసంలో సహాయం అందించడం, వారి ఉత్సాహాన్ని పెంచడం సమాజం కోసం గొప్ప సేవ అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ ట్రస్ట్ ప్రతినిధులు మరియు స్కాలర్‌షిప్‌ను అందుకున్న విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
Latest News
04 Apr 2025 17:39:39
శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో పేట్ బషీరాబాద్ ఏసిపి రాములు మీడియా సమావేశం...