విద్యుత్ స్థంభాన్ని ఢీ కొన్న లారీ
ధ్వంసమైన శ్రీకృష్ణుని ఆలయ మెట్లు
By Ravi
On
TPN...C.N.MURTHY
P.GANNAVARAM
MAR...20
అతివేగం తో పాటు నిర్లక్ష్యంగా అర్ధరాత్రి సమయంలో లారీని నడపటంతో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టడంతో విద్యుత్ స్థంభం తో పాటు, శ్రీ కృష్ణుడి ఆలయ మెట్లు ధ్వంసమయ్యాయి.ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబాజీపేట శివారు స్త్రీల ఆస్పత్రి సమీపంలో ఉన్న దొమ్మేటివారిపాలెం వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని లారీ బలంగా ఢీ కొట్టడంతో విద్యుత్ స్థంభం పూర్తిగా ధ్వంసమైంది.కాగా విద్యుత్ స్తంభానికి పక్కనే ఉన్న శ్రీ కృష్ణుని ఆలయ ప్రాంగణంలో ఉన్న చేతి పంపు, మెట్లు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే ఆలయం వద్ద పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.
Tags:
Related Posts
Latest News
10 Apr 2025 21:22:56
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...