శ్రీకాకుళంలో భారీగా గంజాయి నిర్వీర్యం

7,378 కేజీల గంజాయిని నిర్వీర్యం చేసిన పోలీసులు..

By Ravi
On
శ్రీకాకుళంలో భారీగా గంజాయి నిర్వీర్యం

  • అక్రమ రవాణా, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు-రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి
  • గంజాయి అక్రమ వ్యాపారాలతో ఆస్తులను సంపాదిస్తే వాటినే జప్తుచేస్తాం 
  • మూడవ దశలో 7378 కిలోల గంజాయిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేశామన్న రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి,ఐపిఎస్.

TPN Srikakulam Rajasekhar 
Date 20/03/25


గంజాయి రవాణా చేసినా, అమ్మినా సంబంధిత వ్యక్తుల ఆస్తులు జప్తుచేస్తామని, గంజాయి సేవించే కం వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఐగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి అన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో గడిచిన 8 నెలల్లో ని గంజాయి నిర్మూలనకు రేంజ్ పరిధిలో పోలీస్ త శాఖలో సమూలనమైన మార్పులు తీసుకు వచ్చా మన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసై  అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు. 225 గంజాయి కేసుల్లో పట్టుకున్న 7378 కేజీల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ త్వం ఆధ్వర్యంలో డీఐజీ నిర్వీర్యం చేశారు. శ్రీకాకుళం,  విజయనగరం, పార్వతిపురం మన్యం జిల్లాల పోలీసులు వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న గంజాయిని గురువారం లావేరు మండలం పాత జిల్లా కుంకాం గ్రామం పరిధిలో ఉన్న రైన్బో ఇండస్ట్రీ ఐకు వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి, శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, విజయనగరం ఎస్పీ వకుల్  జిండాల్, పార్వతీపురం మన్యం ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి గంజాయి నిర్వీర్యం కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతు- విశాఖపట్నం రేంజ్ పరిధిలో గడిచిన కొద్ది రోజుల్లో వివిధ కేసుల్లో పట్టుబడిన, స్వాధీనం చేసుకున్న గంజాయిని నిర్వీ ర్యం చేసినట్లు తెలిపారు. 2025 సంవత్సరంలో రేంజ్ పరిధిలో మొదటి దశలో అసకపల్లి జిల్లాలో జనవరి నెలలో 34.419 కేజీల గంజాయి, 39.4 లీటర్ల హషిష్ ఆయిల్, రెండవ దశలో ఏఎస్ఆర్ జిల్లాల్లో ఫిబ్రవరి నెలలో 3075 కేజీల గంజాయి ని, 25.5 లీటర్ల హాకిష్ అంబల్ నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. మూడో దశలో శ్రీకాకుళంలో ప్రస్తుతం డిస్పోజెల్ చేస్తున్నామని తెలిపారు. గడి చిన 8 నెలల కాలంలో గంజాయిని పూర్తిస్థాయి లో నిర్మూలన చర్యల్లో భాగంగా 524 కేసుల్లో 31768 కేజీల గంజాయిని, 12.05 లీటర్ల హాషిష్ ఆయిల్, 372 వాహనాలు సీజ్ చేసి 2050 మంది నింతుల్ని అరెస్టు చేయగా అందులో 575 మంది ఇంటర్ స్టేట్ నిందితులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు ప్రణాళికలో రేంజ్ పరిధి లో గల ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని, గుర్తించి 24 అంతర్ రాష్ట్ర సరిహద్దుగా, 15 జిల్లాల సరిహద్దుగా ప్రధాన చెకో పోస్టులు ఏర్పాటు చేసి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాలకు అనుసం ధానం చేసినట్టు తెలిపారు. గంజాయి సాగుని అరికట్టి, ప్రత్యామ్నాయ పంటలకు గాను 22 రకాల విత్తనాలను 11 ఎకరాలకు రబీ సీజన్లో అందజేశామన్నారు. అదేవిధంగా రజ్మా చిక్కుడు విత్తనాలు 4496 కింటాలు విత్తనాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. డ్రోన్ కెమెరాల నిఘా ఏర్పాటు చేసి 327 గ్రామాల్లో 90 ఎకరాలు గంజాయి సాగుని గుర్తించి నిర్వీర్యం చేయడం జరిగిందని, ఇలాంటి గంజాయి సాగుకి పాల్పడినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుం టున్న తెలిపారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 34 అంతర్ రాష్ట్ర ముఠాని 21, అంతర్ జిల్లాల ముఠాలను పట్టుకొని వారిలో 167 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిందితులుగా గుర్తిందా మని, వారిపై కేసులను నమోదు చేశామని తెలిపారు. వీరులో 49 మందిపై పిడి యాక్టు. 1031 నిందితులపై గంజాయి సస్పెక్ట్ సీట్ తెరిచామన్నారు. గంజాయిని రేంజ్ పరిధిలో పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు సంకల్పం పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 5లక్షల మంది విద్యార్థులు యువతకు చైతన్యం కల్పించి ప్రతి పాఠశాలలో కళాశాలలో డ్రాప్ బాకు ఏర్పాటుచేసి మత్తు పదార్థాల సమాచారాన్ని ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 23 గంజా కేసుల్లో 40 మందికి శిక్షలు పడగా, సుమారు 20 మందికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షలు గంజాయితో పట్టుబడిన వారిపై ఖరారైందని, పెండింగ్లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా ట్రైల్ జరిగే చర్యలు తీసుకుంటామని అన్నారు. గంజాయి అక్రమ రవాణా ద్వారా ఆస్తు లు సంపాదించినవారి అక్రమ సంపదని చట్ట ప్రకారం జప్తు చేస్తామని, ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో ఒక్క కేసులో, విజయనగరం జిల్లాలో ఒక కేసులో ఆస్తులు జప్తు చేసినట్లు తెలిపారు. రేంజ్ పరిధిలో గంజాయి వినియోగిస్తూ పట్టుబడిన 86 మందిని డి-అడిక్షన్ కేంద్రాలకు పంపించి కౌన్సి లింగ్ ఇప్పిస్తున్నామని, వినియోగానికి, సరఫరాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని, వాటి వలన అనేక అనర్ధాలు కలుగుతాయని, అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఏఎస్పీ అంకిత సూరన, విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ సౌమ్యలత, శ్రీకాకుళం అదనపు షిశ్రీనివాస రావు, డిఎస్సీలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-03-20 at 5.42.44 PM

Tags:

Advertisement

Latest News