అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నిరసన

2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్

By Ravi
On
అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నిరసన

హైదరాబాద్, మార్చి 24:

రెండు లక్షల రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్ శాసనసభ సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపారు. ఈ నిరసనను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలతో సమరానికి దిగారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా మాట తప్పిందని, రుణమాఫీ బూటకం అని, కాంగ్రెస్ నాటకంగా పేరు పెట్టి సభలో నినాదాలు చేశారు. "రుణమాఫీ బూటకం, కాంగ్రెస్ నాటకం!", "రెండు లక్షల రుణమాఫీ అరకొర, కాంగ్రెస్ కొరకొర!" అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ను నిరసిస్తూ, ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు న్యాయం చేయాలని, రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన ఘటనతో అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tags:

Advertisement

Latest News