పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ పోలీస్ కమిషనరెట్ పరిధిలో జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద మార్చి 21 నుండి ఏప్రియల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాలకు ఐదు వందల మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, ప్రచారాలు నిర్వహించరాదని పెర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, ముసివేయాలని సూచించారు. పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ గారు తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలున తీసుకోవడం జరుగుతుందని సీపీ తెలిపారు.