హబ్సిగూడ సిగ్నల్ వద్ద డీసీఎం బీభత్సం – నలుగురికి గాయాలు
By Ravi
On
హైదరాబాద్, మార్చి 23:
హైదరాబాద్ హబ్సిగూడ సిగ్నల్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ అయిన డీసీఎం వాహనం, సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మూడు బైకులపై వేగంగా దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌తో పాటు బైకులపై ఉన్న నలుగురికి గాయాలు అయ్యాయి. బైకుపై ఉన్న ఒక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు.
అదృష్టవశాత్తు, సంఘటన సమయంలో ఒక వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు, అయితే అతని బైక్ పూర్తిగా ధ్వంసమైంది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Tags:
Latest News
04 Apr 2025 17:39:39
శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో పేట్ బషీరాబాద్ ఏసిపి రాములు మీడియా సమావేశం...