హబ్సిగూడ సిగ్నల్ వద్ద డీసీఎం బీభత్సం – నలుగురికి గాయాలు

By Ravi
On
హబ్సిగూడ సిగ్నల్ వద్ద డీసీఎం బీభత్సం – నలుగురికి గాయాలు

 

హైదరాబాద్, మార్చి 23:

హైదరాబాద్ హబ్సిగూడ సిగ్నల్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ అయిన డీసీఎం వాహనం, సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మూడు బైకులపై వేగంగా దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌తో పాటు బైకులపై ఉన్న నలుగురికి గాయాలు అయ్యాయి. బైకుపై ఉన్న ఒక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు.

అదృష్టవశాత్తు, సంఘటన సమయంలో ఒక వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు, అయితే అతని బైక్ పూర్తిగా ధ్వంసమైంది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..